Moviesనిజంగా..అలాంటి అవకాశం వస్తే చచ్చిన వదులుకోను.. కీర్తి సురేష్ ఈపెన్ కామెంట్స్...

నిజంగా..అలాంటి అవకాశం వస్తే చచ్చిన వదులుకోను.. కీర్తి సురేష్ ఈపెన్ కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో నమ్మడం చాలా కష్టంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ని నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. కీర్తి సురేష్ కి ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని.. ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసిందంటూ ఓ న్యూస్ వైరల్ గా గా మారింది.

అయితే రీసెంట్ గా ఈ న్యూస్ పై కీర్తి సురేష్ స్పందించింది. ఆమె రియాక్ట్ అవుతూ ..”ఎవరైనా బుద్ధున్న వాళ్ళు ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకుంటారా..? నేనే కాదు ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. మరీ ఇంత చెత్త రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు. మంచి కన్నా చెడు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది . సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయినా ఫాస్ట్ గా సెప్రెడ్ అయిపోతుంది. ఆ అవకాశం నాకు నిజంగా వస్తే చచ్చిన వదులుకోను. ఎన్ని సినిమాలు కమిట్ అయిన ముందు ఎన్టీఆర్ తో నటిస్తాను . ఆయన లాంటి నటుడితో నటించడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది.

కాగా దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తూ కీర్తి సురేష్ ఎన్టీఆర్ జంట బాగుంటుందని కొరటాల శివ ఎవరో బాలీవుడ్ బ్యూటిని తీసుకొచ్చే బదులు టాలీవుడ్ మహానటి ని ఈ సినిమాల్లో పెడితే సినిమాకి మంచి హైప్ వస్తుందని తెరపై ఎన్టీఆర్-కీర్తి చూడడానికి బాగుంటుంది అని చెప్తున్నారు. మరి చూడాలి కొరటాల శివ ఏం చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news