Moviesఊర‌మాస్ డైరెక్ట‌ర్‌తో క‌ళ్యాణ్‌రామ్ ఫిక్స్‌.... ర‌చ్చ రంబోలానే...!

ఊర‌మాస్ డైరెక్ట‌ర్‌తో క‌ళ్యాణ్‌రామ్ ఫిక్స్‌…. ర‌చ్చ రంబోలానే…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ప‌రంగా బింబిసార సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. క‌ళ్యాణ్‌రామ్ 20 ఏళ్ల కెరీర్‌లో చేసింది చాలా సినిమాలే అయినా హిట్లు మాత్రం చాలా త‌క్కువ‌. అతనొక్క‌డే, హ‌రేరామ్‌, ప‌టాస్‌, 118, రీసెంట్గా బింబిసార సినిమాలు హిట్ అయ్యాయి. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే బింబిసార క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ సూప‌ర్ హిట్‌. ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ మార్కెట్ కూడా పెరిగింది.

Prime Video: Racha

కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ తెర‌కెక్కించిన ఈ పిరియాడిక‌ల్ ఫిక్ష‌న‌ల్ డ్రామాకు ఇప్పుడు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వ‌శిష్ట్ ఫ‌స్ట్ పార్ట్‌ను మించి ఉండేలా సీక్వెల్ కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. బింబిసార ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్టులకు క‌ళ్యాణ్ ఓకే చేస్తున్నాడు. క‌ళ్యాణ్‌రామ్ మార్కెట్ పెర‌గ‌డంతో మ‌నోడితో సినిమాలు చేసేందుకు కూడా పెద్ద నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు.

Sampath Nandi - Movies, Biography, News, Age & Photos | BookMyShow

తాజాగా క‌ళ్యాణ్‌రామ్ ఓ మాస్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు సంప‌త్‌నంది. సంప‌త్‌నంది రీసెంట్‌గా గోపీచంద్‌తో సిటీమార్ సినిమాను తెర‌కెక్కించాడు. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ‌, ర‌వితేజ‌తో బెంగాల్ టైగ‌ర్ లాంటి ఊర‌మాస్ హిట్లు కొట్టిన సంప‌త్ బాల‌య్య‌తో సినిమా కోసం ట్రై చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు.

Happy Birthday Sampath Nandi: Some working stills from his next film Seetimaarr | Telugu Movie News - Times of India

ఇప్పుడు నంద‌మూరి కాంపౌండ్‌కు చెందిన క‌ళ్యాణ్‌రామ్‌కు క‌థ చెప్పి ఓకే చేయించుకున్నాడ‌ని తెలుస్తోంది. సంప‌త్‌నంది అంటేనే ఊర‌మాస్ కాన్సెఫ్ట్‌లు ఉంటాయి. ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్‌ను కూడా అదే యాంగిల్లో చూపిస్తాడ‌నే అనుకోవాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ బావ‌మ‌రిది హ‌రికృష్ణ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news