Moviesబిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో నయన్-విగ్నేశ్..భారీ ఎదురు దెబ్బ..!?

బిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో నయన్-విగ్నేశ్..భారీ ఎదురు దెబ్బ..!?

పాపం,, ఈ సెలబ్రిటీ జంట ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. అయితే పెళ్లి తర్వాత నయన్ విగ్నేష్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని సంతృప్తి పరిచారు .

అయితే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉండడంతో ఫాన్స్ ఈ జంట నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా నయనతార ఇంత త్వరగా గుడ్ న్యూస్ వినిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఫాన్స్. మనకు తెలిసిందే అక్టోబర్ 9వ తేదీ రాత్రి విగ్నేష్ శివ తన ఇంస్టాగ్రామ్ వేదికగా..” నయనతార నేను అమ్మ అప్ప లం అయ్యాము” అంటూ అఫీషియల్ గా ప్రకటించడంతో.. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయింది .

పెళ్లైన నాలుగు నెలలకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన నయనతార అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీళ్ళు సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు అంటూ కొన్ని న్యూస్ టెలికాస్ట్ అయ్యాయి .ఈ క్రమంలోనే ఇండియాలో సరోగసి బ్యాన్ చేసి చాలా టైం అవుతుంది మరి ఆ ప్రాసెస్ ని ఎలా వీళ్లు అప్లికేబుల్ చేసుకున్నారు.. అన్నదానిపై కోలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ సరోగసి ప్రాసెస్ లీగల్ గా చేశారా లేదా వాళ్ళ చట్టబద్ధంగా సరోగసి ప్రక్రియ జరిగిందా అనే విషయంలో ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ సరోగసి పై ప్రభుత్వానికి వివరణలు అందించాలని ఆదేశించారు . దీంతో ఈ వివాదం పై నయన్-విగ్నేష్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళపై పోలీస్ కేసు ఫైల్ అయినట్టు తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్ లో వీళ్లు అటెండ్ అయినట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకు వస్తుంది. మరి చూడాలి దీనిపై నయన్ విగ్నేష్ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news