Moviesనాగార్జున‌కు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా...!

నాగార్జున‌కు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా…!

ఎస్ ఇప్పుడు ఇదే సందేహం ప్రతి ఒక్కరికి వస్తోంది టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీది నాలుగు దశాబ్దాల అనుబంధం. ఆ ఫ్యామిలీకి ముందు నుంచి ఒక ఫ్యాన్స్ బేస్‌ అన్నది ఉంది. దివంగత లెజెండ‌రీ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు అప్పట్లో ఎన్టీఆర్ తో స‌మానంగా కాస్త అటు ఇటుగా అభిమానులు ఉండేవారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు అభిమానులు మరింత ఎక్కువయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి ముందు నుంచి ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు మహిళా అభిమానులు ఎక్కువగా ఉండేవారు. అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తొలిరోజు తొలి షోకే మహిళా ప్రేక్షకులు వచ్చేవారు అంటే వాళ్లకు ఆయా సెక్షన్స్ లో ఎలాంటి బలమైన ఫాలోయింగ్ ఉందో తెలుస్తోంది.

అయితే రాను రాను ఏఎన్నార్ తర్వాత ఆ ఫ్యాన్స్ బేస్‌ తగ్గుతూ వస్తుంది. నాగార్జునకు కూడా శివ, నిన్నే పెళ్ళాడుతా, మన్మధుడు సినిమాల తర్వాత విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. తండ్రి ఏఎన్ఆర్ లాగా నాగార్జునకు కూడా మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. కట్ చేస్తే ఇప్పుడు నాగార్జునకు ఫ్యాన్స్ తగ్గిపోవడం కాదు పూర్తిగా మాయమైపోయారని చెప్పాలి. నాగార్జునలాంటి క్రేజీ హీరో సీనియర్ హీరో సినిమా వస్తుంది అంటే తొలిరోజు తొలి ఆటకు ఎంత హంగామా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు నాగార్జున సినిమాలకు తొలి రోజు తొలి షోకే డిమాండ్ ఉండటం లేదు.

అసలు నాగార్జున సినిమాల‌కు బెనిఫిట్ షోలు అన్నవే కనుమరుగై పోయాయి. నాగార్జున నటిస్తున్న తాజా సినిమా ది ఘోస్ట్ కు ఓపెనింగ్స్ మరీ నీరసంగా కనిపిస్తున్నాయి. దీనికి పోటీగా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు మోహనరాజా దర్శకుడు. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు. అయినా కాస్త కూస్తో చిరు సినిమాకే అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి తప్ప ది ఘోస్ట్ ను పట్టించుకున్న వాళ్లే కనపడటం లేదు. నాగర్జున గతంలో నటించినా వైల్డ్ డాగ్‌ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేసినా ప్రేక్షకులు తొలిరోజే ఘోరంగా తిరస్కరించారు. అంతకుముందు మన్మధుడు 2 సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సినిమా చూసిన నాగార్జున అభిమానులే దారుణంగా తిట్టిపోశారు.

ఆ తర్వాత చైతు, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి సోలోగా వచ్చి హిట్ కొట్టిన కనాకష్టంగా బ్రేక్ వెన్ కు చేరుకుంది. నాగార్జున ఇంకా యాక్షన్ – రొమాన్స్ అంటూ వైల్డ్ డాగ్, మన్మధుడు 2, ది ఘోస్ట్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే సినీ ప్రేమికులు లైట్ తీసుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలీలో రెండవ తరంలో కూడా నాగార్జునను అభిమానించిన వాళ్లలో చాలామంది ఇతర హీరోల అభిమానులుగా మారిపోయారు. మరికొందరు మాత్రం అఖిల్, చైతన్య ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఓవరాల్ గా చూస్తే నాగ్‌కు ఫ్యాన్స్ ఏమాత్రం లేనట్టే కనిపిస్తోంది. దీనికి తోడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా నాగార్జున ఇప్పటికే చాలామందికి దూరమైపోయాడు. నాగార్జున రాజకీయంగా పరోక్షంగా ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. దీంతో మరో పార్టీని బాగా అభిమానించే వర్గాలు ఆయనకు ఎప్పుడో దూరమైపోయాయి. అందుకే ఆయన సినిమాలకు అసలు కలెక్షన్లు కూడా రావటం లేదు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బంగార్రాజు సినిమాకే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

నాగార్జున ఏజ్ హీరోల్లో చిరంజీవికి ఎక్కువ మంది అభిమానులే ఉన్నారు. వాళ్ల‌లో ఇప్పుడు చాలా మంది చెర్రీ, బ‌న్నీ, ప‌వ‌న్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆచార్య‌కు రిలీజ్‌కు ముందు పెద్ద బ‌జ్ లేకపోవ‌డానికి ఈ త‌రం జ‌న‌రేష‌న్లో వ‌స్తోన్న మార్పు కూడా కార‌ణ‌మే. బాల‌య్య అఖండ హిట్ అవ్వ‌డానికి కూడా స‌బ్జెక్ట్‌కు తోడు బాల‌య్య రోల్‌చాలా కొత్త‌గా ఉండ‌డం.. దీనికి తోడు అన్‌స్టాప‌బుల్ షోతో బాల‌య్య ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు బాగా క‌నెక్ట్ కావ‌డ‌మే. ఏదేమైనా నాగ్ త‌న వ‌య‌స్సుకు త‌గిన‌ట్టుగా క‌థ‌లు ఎంచుకుని సినిమాలు చేయాలి.. లేక‌పోతే ఇంట్లో కూర్చోవ‌డం ఉత్త‌మం.. అంతే త‌ప్పా రొటీన్ రొట్ట సినిమాలు చేస్తే జ‌నాలు తొలి రోజే ప్లాప్ చేసేస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news