Moviesఎవ్వడైన రండి..నాకు ఏం భయం లేదు..మోహన్ రాజా షాకింగ్ ఛాలెంజ్ ..!?

ఎవ్వడైన రండి..నాకు ఏం భయం లేదు..మోహన్ రాజా షాకింగ్ ఛాలెంజ్ ..!?

మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “గాడ్ ఫాదర్”. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై మెగా అభిమానుల్లో బోలెడన్ని ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచుకునేలా చేసింది . కాగా ఈ సినిమాను డైరెక్టర్ చేస్తుంది మోహన్ రాజా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .మనందరికీ తెలిసిన వ్యక్తి . అయితే “గాడ్ ఫాదర్” సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అందరినీ వెంటాడే భయం ఈ సినిమా రీమిక్ కావడంతో కచ్చితంగా అదే సీన్స్ ఉంటాయి అని ఫిక్స్ అయిపోయారు.


గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలోని ఇదే జరిగింది . మలయాళం సినిమాకు పూర్తి రీమేక్ కావడంతో ఆ సినిమాలో అక్కడక్కడ మార్పులు చేసి పవన్ కళ్యాణ్ పవర్ ని దట్టించి తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే ఇదే క్రమంలో చిరంజీవి కూడా అలానే డైరెక్టర్ చేతిలో మోసపోతున్నాడని మెగా ఫాన్స్ అపోహ పడ్డారు . కాగా దీనిపై మోహన్ రాజా అఫీషియల్ గా స్పందించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అందరూ ఈ సినిమాని రీమిక్ సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు . ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది . మలయాళం సినిమా లూసిఫర్ కి ఇది పేరుకే రిమేక్. కానీ మొత్తం మా స్టైల్లో తెరకెక్కించాం. సినిమా చూసిన ఎవ్వరైనా సరే ఒరిజినల్ వర్షన్ లా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను డైరెక్టర్ కాదు అని అనుకుంటాను “.

“ఎందుకంటే ఇప్పుడు ఇతర భాషల చిత్రాలు కూడా ఓటీటీలో లభిస్తున్నాయి. దీంతో ఒరిజినల్ వర్షన్ చూసిన ప్రేక్షకులు అలాగే పోలుస్తున్నారు.. లోపాలు వెతుకుతున్నారు. అయితే ఆ టెన్షన్ గాడ్ ఫాదర్ చిత్రానికి ఉండదని నేను అనుకుంటున్నాను . ఎందుకంటే ఈ సినిమా టోటల్ నా స్టైల్ లో తెరకెక్కించాను. ధైర్యంగా చెప్తున్నాను సినిమా థియేటర్స్ కి వచ్చి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది .

దమ్ముంటే ఎవరైనా సరే థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూసి వచ్చి నిజాయితీగా గుండెలపై చేయి వేసుకొని చెప్పండి.. సినిమాను మొత్తం రీమిక్ లానే ఉంది అని . నాకు ఆ భయం లేదు ఎందుకంటే నేను సినిమాను కాపీ కొట్టలేదు . నా స్టైల్ లో కంటెంట్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేసాను. నేను కూడా లూసిఫర్ సినిమాను చూశాను. నా స్టైల్ లో కథను మార్చి తెరకెక్కించాను” అంటూ మోహన్ రాజా ఓపెన్ గా అభిమానులకు సవాల్ విసిరారు. మనకు తెలిసిందే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు నటిస్తున్నాడు. అంతే కాదు ఫ్రెండ్షిప్ కోసం ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట సల్మాన్ ఖాన్. మరి చూడాలి గాడ్ ఫాదర్ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news