Moviesసాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో...

సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..? మనకు బాగా తెలిసిన మూవీనే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించి ..అలరించి .. మెప్పించి ..ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు . అయితే అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో చాలామంది ఫ్లాప్ అయ్యారు . ఎవరో ఒకరో ఇద్దరో సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా మనల్ని మెప్పించి ప్రజెంట్ ఇప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న బ్యూటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం . ఆమె ఎవరో కాదు బ్యూటీ క్వీన్ సాయి పల్లవి.

సాయి పల్లవి ..ఈ పేరు కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మల్లర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగులో జనాలకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత వరుసగా బిగ్ సినిమాలకు కమిట్ అవుతూ ..టాలీవుడ్ ను షేక్ చేసింది . అయితే ఇప్పటివరకు చాలామందికి తెలియదు సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిందని. కాగా సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు మనం డైలీ టీవీ లో చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కడా కూడా ఆమెను గుర్తుపట్టలేం.

 

దీంతో ఇప్పుడు సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా కంగనా రనౌత్- జయం రవి హీరో హీరోయిన్లుగా నటించిన దామ్ ధూమ్. ఈ సినిమాలో సాయి పల్లవి..కంగాన పక్కన చిన్న పిల్లలా వెనకల కూర్చొని ఉంటుంది. నిజానికి సాయి పల్లవి ఈ సినిమాలో నటించేటప్పటికి తన వయసు ఆరేళ్లే. ఇక ఆ తర్వాత సాయి పల్లవి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చైల్డ్ పాత్రలో చైల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది. ప్రసన్న హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్గా నటించిన సినిమాలో నటించింది. ఇలా సాయి పల్లవి పలు సినిమాల్లో క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి వచ్చింది. ఎవరు ఊహించిన విధంగా సాయి పల్లవి కేవలం టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news