Moviesఎన్టీఆర్ కు అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్.. ఫ్యాన్స్ కోరికలో న్యాయం ఉందిగా..!

ఎన్టీఆర్ కు అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్.. ఫ్యాన్స్ కోరికలో న్యాయం ఉందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో మరి ఎవరికి లేనంత స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ నందమూరి హీరోలకి ఉంది . వాళ్ళలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తారక్ గురించి . నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన తారక్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. ఆయనను హీరోలా కాదు తమ ఇంట్లోని పెద్దదిక్కుల ఓ అన్నలా భావిస్తూ ఉంటారు.

తారక్ కూడా అంతే ఏ ఆడియో ఫంక్షన్ కి వెళ్లిన ఈవెంట్స్ కి అటెండ్ అయిన ముందు ఆరోగ్యం జాగ్రత్త ..ఎంత జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారో..అంతే జాగ్రత్తగా మీరు ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్తాడు. మిగతా ఏ హీరోలు కూడా ఈ విధంగా చెప్పరు. అంతే కాదు ఎవరైనా హీరో సెల్ఫీ లు అంటూ మీద పడినా కానీ అసహ్యించుకోడు . దగ్గరికి పిలిచి సెల్ఫీలు ఇస్తారు. ఎంత ప్రేమగా దగ్గరికి తీస్తారో.. తప్పు పని చేస్తే అంతే కోపంగా అరుస్తారు. తనకి ఇష్టం లేని రాజకీయాల్లోకి తనని లాగొద్దు అంటూ ఎన్టీఆర్ ఎన్నో ఈవెంట్లలో స్టేజ్ పైన చెప్పాడు . సీఎం అంటూ అరుస్తూ ఉంటే అప్పుడే ఫ్యాన్స్ పై మండి పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు మరో స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు . అదేంటంటే రీసెంట్గా కన్నడలో రిలీజ్ అయిన కాంతారా సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ కథ చాలా నాచురల్ గా ఉందని ఆ లుక్స్ లో రిషిబ్ శెట్టి లుక్స్ చాలా ఆకట్టుకున్నాయని విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు . ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా చూశాక ఓ కోరిక పుట్టిందట . తారక్ కూడా ఇలాంటి స్టోరీలో నటిస్తే చూడాలని ఉందట .అలా నాచురల్ లుక్స్ లో తారక్ నటిస్తే చూడాలని ఉందట. ఆ టైప్ ఆఫ్ కధలో..ఆ రోల్ లో తారక్ ను చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news