Moviesఆ పొగరు క్యారెక్టర్ కి అతడే కరెక్ట్ మొగుడు.. ఆ హిట్...

ఆ పొగరు క్యారెక్టర్ కి అతడే కరెక్ట్ మొగుడు.. ఆ హిట్ సినిమాను పవన్ కి సజిస్ట్ చేసింది బాలయ్యనే..!!

నందమూరి హీరో బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. కోపం వస్తే అరవడం మంచి పని చేస్తే పోగడటం బాలయ్యకు మొదటి నుంచి అలవాటు. కానీ కొంతమంది ఆయన కోపం చూసి ఆయన దగ్గరికి వెళ్లడానికి భయపడతారు కానీ బాలయ్య మనసు చాలా మంచిది .అంతేకాదు నందమూరి తారక రామారావు గారు లాగా బాలయ్యకు మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. కష్టం అని తన దగ్గర వచ్చిన వాళ్ళకే కాదు.. ఇతరులు కష్టపడుతున్నారని తెలుసుకున్నా సరే ఆ కష్టాన్ని తీర్చడానికి తన వంతు సహాయం చేస్తాడు బాలయ్య .

ఇప్పటివరకు అలా బాలయ్య చేసిన సహాయాలు ఎన్నో.. అందరిలాగా సహాయం చేసి మీడియా ముందుకు వచ్చి డప్పు కొట్టుకోరు బాలయ్య. సహాయం చేస్తే అది వాళ్ళకి సహాయపడిందా లేదా అన్న పాయింట్ లోనే ఆలోచిస్తారు.. తప్పిస్తే నేను సహాయం చేశారని అందరికీ తెలిసేలా చెప్పుకోవాలని అనుకోరు బాలయ్య . కాగా రీసెంట్గా బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బాలయ్య అన్ స్టాపబుల్ 2 షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. సీజన్ వన్ హిట్ అవడంతో సీజన్ 2 పై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు జనాలు .

అయితే ఈ షోలో రీసెంట్గా సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, గెస్ట్లుగా వచ్చారు . కాగా మధ్యలో నిర్మాత నాగ వంశీ కూడా యాడ్ అయ్యారు. ఈ క్రమంలోని బాలయ్య కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది . మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన భీంలా నాయక్ సినిమా కధ ముందు బాలయ్య దగ్గరికి వెళ్లింది.

ఈ సినిమా రీమిక్స్ రైట్ అందుకున్న మరో క్షణం ఈ కథకు బాలయ్య అయితే బాగుంటారని నిర్మాతలు ఆయన వద్దకు వెళ్లారట . అయితే ఈ కథ విన్న బాలయ్య .. ఆ పొగరు క్యారెక్టర్ నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అవుతుందని మంచిగా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి పవన్ పేరు సజిస్ట్ చేశారట. ఇక వెంటనే నిర్మాతలు పవన్ దగ్గరికి వెళ్లడం ఆ సినిమా వినగానే పవన్ ఓకే చేయడం.. తెరకెక్కించడం బ్లాక్ బస్టర్ అవ్వడం వరుసగా జరిగిపోయాయి. ఇలా తన స్వార్థం కోసం కాకుండా అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి బాలయ్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇదొక్కటి చాలదు బాలయ్య ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవడానికి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news