Moviesశ్రీముఖి ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా.. సుమ కూడా...

శ్రీముఖి ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా.. సుమ కూడా వేస్ట్..!?

సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా స్టార్ గ్లామరస్ బ్యూటీస్ ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ వెండి తెర తారలకు మేము ఏమాత్రం తీసిపోము అంటూ ప్రూవ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో వెండి తెరపై కన్నా బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీలు హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది యాంకర్ శ్రీముఖి . ఈ అమ్మడి గురించి ఎంత చెప్పినా తక్కువే .ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.

ఫుల్ జోష్ తో సరదా సరదాగా కబుర్లు చెబుతూ అల్లరి అల్లరి చేస్తూ సౌండ్ స్పీకర్ అనే బిరుదును కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా శ్రీముఖి అంటే మరో రాములమ్మ అంటూ బుల్లితెరపై జనాలు కామెంట్స్ చేస్తారు.కాగా శ్రీముఖిఫాం లోకి వచ్చింది పటాస్ షో తోనే అని చెప్పాలి . ఈ షో చేస్తున్నప్పుడే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ షోను వదులుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఆడి పాడి మెప్పించింది. అయితే బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సొంతంగా తనకు సంబంధించిన విషయాలను జనాలకు చేరవేసింది.

కాగా ప్రజెంట్ పలు సినిమాల్లో నటిస్తూ బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటున్న శ్రీముఖి ..చేతిలో బోలెడన్ని షోస్ పట్టుకొని రెండు చేతుల సంపాదిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి ఒక్క ఎపిసోడ్ కి దాదాపు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట. మరి ముఖ్యంగా ఈ మధ్యనే అగ్రిమెంట్ పై సైన్ చేసిన డాన్స్ ఐకాన్.. మిస్టర్ అండ్ మిసెస్ షోలకు శ్రీముఖి ఏకంగా ఒక్క ఎపిసోడ్ కి 1,50,000 చేస్తున్నట్లు తెలుస్తుంది .అంతగా ఆమె తన రేంజ్ ను మార్చేసుకుంది. నిజానికి ఒక షోకి 1,50,000 సుమ కూడా అందుకోదు. ఈవెంట్ 80000 తీసుకుంటుంది. అది మరీ కూడా స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువ టైం తీసుకుంటే ఆ షో కి 1,20,000..అంతే. ఇప్పటివరకు సుమ తీసుకుని హైయెస్ట్ రెమ్యూనరేషన్ లో ₹1,30,000 . కాగా ఇప్పుడు సుమనే మించిపోయే శ్రీముఖి ఎదిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news