Moviesకేక పుట్టిస్తున్న దిల్ రాజు భార్య.. వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు..!?

కేక పుట్టిస్తున్న దిల్ రాజు భార్య.. వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజుకి ఎలాంటి పేరు ఉందో మనకు తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించిన దిల్ రాజు ..ఆ తర్వాత తనకున్న టాలెంట్ తో తెలివితేటలతో మెల్లమెల్లగా ప్రొడ్యూసర్ గా మారి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సినీ ఇండస్ట్రీని ఏలే అగ్ర ప్రొడ్యూసర్ గా మారిపోయాడు . ప్రజెంట్ ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్న పోస్ట్ పోన్ అవ్వాలన్నా.. ఓటీటీకి రావాలన్నా డేట్లు డిసైడ్ చేసేది దిల్ రాజునే. ఈ విషయం అందరికీ తెలిసిందే . అంతలా తన పేరును పాపులర్ చేసుకున్నాడు దిల్ రాజు. సినిమాలపరంగా ఎప్పుడూ బ్యాక్ స్టెప్ వేయని దిల్ రాజు లైఫ్ లోను అలాగే ముందుకు కొనసాగుతున్నాడు.

మనకు తెలిసిందే దిల్ రాజు మొదటి భార్య మరణించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్ రాజు కూతురు నాన్న కోసం ఓ చక్కటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసింది . ఆమె ఎవరో కాదు తేజస్విని. దిల్ రాజుకు దూరపు బంధువు అవుతారట. నిజానికి దిల్ రాజుతో కంపేర్ చేస్తే తేజస్విని వయసు చాలా చిన్నది .కానీ వాళ్ళ జాతకాలు కుదరడంతో పెళ్లి చేశారు అన్న న్యూస్ గతంలో వైరల్ గా మారింది . కాగా రీసెంట్ గానే ఓ పండు లాంటి బాబుకు జన్మనిచ్చిన తేజస్విని తన అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది .

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారో తెలిసిందే. ఒంటి మీద బట్ట ఉందా లేదా అన్నట్టు దారుణంగా ఫోటో షూట్ చేస్తున్నారు. అలాంటి టైం లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని నిండైన చీరతో ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజస్విని ట్రెడిషనల్ ఫొటోస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

తేజస్విని ఫోటోలు చూడ చక్కగా అచ్చం తెలుగింటి అమ్మాయిల.. చీర కట్టుకొని నగలు పెట్టుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది . ఈ ఫొటోస్ చూసిన అందరూ స్టార్ హీరోయిన్స్ నిన్ను చూసి నేర్చుకోవాలి తేజస్విని అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు సూపర్ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో దిల్ రాజు రెండో భార్య ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news