Moviesవావ్‌: తెలుగు బుల్లితెర‌పై క్రేజీ జోడీగా రాకింగ్ రాకేష్ – జోర్దార్‌...

వావ్‌: తెలుగు బుల్లితెర‌పై క్రేజీ జోడీగా రాకింగ్ రాకేష్ – జోర్దార్‌ సుజాత..!

తెలుగు బుల్లితెర‌పై ఎన్నో జంట‌లు రాకింగ్ క్రేజ్‌తో దూసుకు పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలెంట్ ఉంటే చాలు… ఎంత సామాన్యులు అయినా క‌ష్ట‌ప‌డి బుల్లితెర సెల‌బ్రిటీలుగా మారుతున్నారు. ఈ లిస్టులోకే చాలా త‌క్కువ టైంలోకి దూసుకు వ‌చ్చారు రాకింగ్ రాకేష్‌, జోర్దార్ సుజాత‌. అభిమానులు ముద్దుగా రాకింగ్ రాకేష్‌గా పిలుచుకునే రాకేష్ జ‌బ‌ర్ద‌స్త్ టీంలో మెంబ‌ర్‌గా చేరి అతి త‌క్కువ టైంలోనే టీం లీడ‌ర్ స్థాయికి ఎదిగాడు.

రాకేష్ రాకింగ్ చేసిన స్కిట్స్‌కు తెలుగు ప్రేక్ష‌కులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఆ స్కిట్స్ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌కే మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా రాకేష్ చేసిన స్కిట్ల‌తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. ఇక సుజాత కూడా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఓ మారుమూల ప‌ల్లెటూరు నుంచి వ‌చ్చి ఈ స్థాయికి ఎదిగింది.

ఓ టీవీ ఛానెల్లో చిన్న జాబ్‌లో జాయిన్ అయిన సుజాత జోర్దార్ వార్త‌ల‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న తెలుగు అభిమానుల మ‌దిని దోచింది. ఆ దెబ్బ‌తో ఆమె జోర్దార్ సుజాత అయిపోయింది. ఆ క్రేజ్‌తోనే ఆమె బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. జబ‌ర్ద‌స్త్‌లో రాకింగ్ రాకేష్‌తో క‌లిసి సుజాత చేసిన స్కిట్స్ ప్ర‌జ‌ల‌ను బాగా అల‌రించాయి. ఆ స్కిట్లు చేస్తూ వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డి పెద్ద‌ల‌ను ఒప్పించుకున్నారు. ప్రేమ త‌ర్వాత ఈ జంట తెలుగు బుల్లితెర‌తో పాటు సోష‌ల్ మీడియాలో మంచి పాపుల‌ర్ అయిపోయింది.

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా వీరి ఫొటోలే వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా వీరి క్రేజ్‌కు మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. వీరు ఈటీవీ మిస్టర్ అండ్ మిసెస్ రియాల్టీ షో లో ఒక జంటగా పాల్గొంటున్నారు. ఈ షో ప్రారంభం కాకుండానే ఈ జంట అయితే హైలెట్ అయ్యింది. మ‌రి వీరిద్ద‌రు షోలో ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news