Moviesపీరియడ్ బ్లడ్ తో లడ్డు.. హిట్ కోసం కంగనా అలాంటి పని...

పీరియడ్ బ్లడ్ తో లడ్డు.. హిట్ కోసం కంగనా అలాంటి పని చేసిందా..?

కంగనా రనౌత్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ ..వివాదాల్లో తలదూరుస్తూ ..సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా హెడ్లైన్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. కాగా కొంతకాలం నుండి కంగనా పొలిటికల్ పార్టీలపై కూడా సెటైర్స్ వేస్తూ బిజెపికి సపోర్ట్ చేస్తూ పొలిటికల్ బేస్ లో కూడా నెగెటివిటీని సంపాదించుకుంది . తాజాగా మరోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే మొదటి నుంచి కంగానా అంటే బాలీవుడ్ లో ఎవ్వరికీ పడదు . ఆమె ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడుతుంది.

అందువల్లే కంగనా అంటే చాలామందికి కోపం అంటూ గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు మరి ముఖ్యంగా కరణ్ జోహార్ అంటే కంగనాకు విపరీతమైన కోపం ఉంటుంది . అందుకే ఎప్పుడు కరణ్ జోహార్ పై సెటైర్స్ వేయాలన్న అస్సలు ఛాన్స్ వదులుకోరు. కాగా గతంలో కంగనా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి క్షుద్ర పూజలు చేసిందని అంతేకాకుండా ఆమెకు బ్లాక్ మ్యాజిక్ స్కిల్స్ ఉన్నాయని న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాకుండా ఓ ప్రముఖ పత్రిక దీనికి వత్తాసు పలుకుతూ వార్తలు ప్రచురించింది. ఈ క్రమంలోనే కంగనా ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది .

అంతేకాదు నేను స్టార్ హీరోయిన్ అవ్వడానికి కారణం మంత్రాలే అని కొందరు తేల్చేశారు అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ వీడియోని షేర్ చేసింది ..”సూపర్ పవర్స్ ఉంటే మిమ్మల్ని మంత్రగత్తే అంటారు. కాబట్టి నన్ను అలాగే పిలిచేవారు. నేను ఎవరిని ఏ రకంగా మందలించలేదు . కానీ నాకు మంత్రగత్తె అనే ముద్రవేశారు. హ హ హ అబ్రకదబ్ర “అంటూ రాసుకొచ్చింది. ఇలా తనపై నీచమైన ముద్ర వేసిన వారిని ఉద్దేశిస్తూ ..అలాంటి వాళ్లకి “పీరియడ్ బ్లడ్ తో లడ్డూస్ గా చేసి దీపావళి పండుగకు పంపిస్తాను” అంటూ దారుణమైన కౌంటర్ వేసింది . దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండానే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదగడానికి కష్టపడుతున్నానని ..అది చూసి ఓర్వలాగే కొందరు ఇలా తనపై నిందలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news