Moviesసుడిగాలి సుధీర్ రాంగ్ స్టెప్.. కెరీర్ ని కూల్చేస్తున్న స్టార్ యాంకర్..!?

సుడిగాలి సుధీర్ రాంగ్ స్టెప్.. కెరీర్ ని కూల్చేస్తున్న స్టార్ యాంకర్..!?

ఎస్ ఇప్పుడు అందరు ఇదే అంటున్నారు. సుడిగాలి సుధీర్ తన కెరీర్ ను నాశనం చేసుకునే డెసిషన్ తీసుకున్నారా..? అంటే అవునని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ . అంతేకాదు బుల్లితెర నిపుణులు కూడా ఇదే మాటను అంటున్నారు. మనకు తెలిసిందే జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు సుధీర్ . ఈ క్రమంలోనే సుధీర్ నుంచి సుడిగాలి సుధీర్ర్ గా మారి యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ స్టార్ హీరోకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ సుడిగాలి సుధీర్ కి ఉంది . దానికి మెయిన్ రీజన్ ఆయన కష్టపడి పైకి రావడం ..ఆయనలో ని టాలెంట్ను జనాలు ఆదరించడం.

మ్యాజిక్ షోస్ చేసుకొని కడుపు నింపుకున్న సుధీర్ర్.. రోడ్డుపై పడుకొని తిండి లేకుండా ఉండే రోజులు కూడా గడిపారట. ఇదే విషయాన్ని ఆయన జబర్దస్త్ లో స్కిట్లో భాగంగా తెలియజేశాడు . అంత కష్టాలు పడ్డ సుధీర్ కు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది . అయితే ప్రజెంట్ సుధీర్ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ని వదిలేసుకొని తప్పు చేశాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అంతేకాదు జబర్దస్త్ తర్వాత సుధీర్ ..ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా మెరుస్తూ స్కిట్స్ వేస్తూ హోస్ట్ గా చేస్తూ అలరించాడు. కాగా కొన్ని చెడు సావాసాల కారణంగా సుధీర్ మెల్లగా మెల్లగా ఢీ షోను ..ఆ తర్వాత జబర్దస్త్.. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ను వదిలేసాడంటూ జనాలు చెప్పుకుంటున్నారు .

దీనంతటికీ కారణం యాంకర్ ఓంకార్ అంటూ తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఎస్ ఈటీవీలో టాప్ పొజిషన్లో ఉన్న సుధీర్ ను డబ్బులు ఎరగా వేసి ఓంకార్ స్టార్ మా కు తీసుకెళ్లాడు అంటూ సంచలనంగా మారింది . రీసెంట్ గా స్టార్ మాలో సుడిగాలి సుధీర్ర్ ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈటీవీలో కనిపించకపోవడం సడన్గా మాటీవీలో ప్రత్యక్షమవడంతో సుధీర్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అని ..ఆయన కెరియర్ మొదలవడానికి కారణం ఈటీవీ అని.. అలాంటి ఈటీవీ ని వదిలేయడం ఎంతవరకు సమంజసం అని నమ్మకద్రోహం చేస్తున్నాడని జనాలు మండిపడుతున్నారు. అంతే కాదు అతన్ని నమ్ముకుంటే సంక నాకి పోతావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి చూడాలి దీనిపై సుడిగాలి సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news