Moviesపెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్... ఇప్పుడేమో మరొకరితో ..!

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్… ఇప్పుడేమో మరొకరితో ..!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు ఎంత స్పీడుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే అంద‌రూ స్పీడ్ గా ఉంటారని చెప్ప‌లేం కానీ కొంత‌మంది బ్యూటీలు మాత్రం చాలా స్పీడ్ గా ఉంటారు. పెళ్లి కాకముందు డేటింగ్‌లు అనేది ప్ర‌స్తుతం చాలా కామ‌న్ అయిపోయింది. అలా చాలా కాలం డేటింగ్ చేసి ఆ త‌ర‌వాత పెళ్లిళ్లు చేసుకుంటారు. అయినప్ప‌టికీ వైవాహిక జీవితం ఆస‌క్తిగా లేక‌పోతే బ్రేక‌ప్ చెప్పుకుని ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటారు. మ‌రోవైపు పెళ్లి కాకుండానే బాయ్ ఫ్రెండ్స్ తో పిల్ల‌ల‌ను కంటున్న భామ‌లు కూడా ఉన్నారు.

ధ‌నుష్ హీరోయిన్ అమీ జాక్స‌న్ అదే ప‌నిచేసింది. అమీ జాక్స‌న్ త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. శంక‌ర్ – విక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఐ సినిమాలో న‌టించి స్టార్ హీరోయ‌న్ స్టేట‌స్ అందుకుంది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ ఎవడు సినిమాలోనూ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. అదే విధంగా రోబో 2.0 సినిమాలోనూ త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది. ఇక ఫారిన్ బ్యూటీ ఇప్ప‌టి వ‌ర‌కూ పెళ్లి చేసుకోలేదు.. కానీ బిడ్డ‌కైతే జ‌న్మనిచ్చింది.

విన‌డానికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇది నిజం. ఈ అందాల తార కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే బ‌డా వ్యాపారవేత్త జార్జ్ ప‌నియోటౌతో ఎఫైర్ న‌డిపించింది. చాలా కాలం పాటూ ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా జార్జ్ తో అమీ జాక్సన్ ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. ఇక గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో అమీ జాక్స‌న్ బిడ్డ పుట్టిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ళ్లీ పెళ్లి ఊస ఎత్త‌లేదు.

ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు ప్రియుడు జార్జ్ ను వ‌దిలేసి హాలీవుడ్ న‌టుడు ఎడ్వెస్టిక్ తో ఈ బ్యూటీ ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తున్న‌ట్టుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా అమీ జాక్సన్ త్వరలోనే ఎడ్వెస్టిక్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అమీ జాక్సన్ నోరు విప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news