Moviesప్లీజ్..అలా చేయకండి..శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ పై కండక్టర్ ఝాన్సీ సంచలన...

ప్లీజ్..అలా చేయకండి..శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ పై కండక్టర్ ఝాన్సీ సంచలన కామెంట్స్..!!

లేడీ కండక్టర్ ఝాన్సీ ..ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యమ హాట్ గా తయారైంది. పల్సర్ బండి మీద రారా అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని వారాలుగా పల్సర్ బండి మీద రారా అంటూ ఓ అమ్మాయి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారిందో మనకు తెలిసిందే.

 

ఆమె ఆ పేరు తోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు . ఆ పాటకు ఆమె వేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు స్టార్స్ సైతం ఆమెలోని మంచి టాలెంట్ ని గురించి ఓ రేంజ్ లో పొగిడేశారు ..ప్రశంసిస్తున్నారు. కాగా ఆమె రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్ పై కొందరు విమర్శకులు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె భర్తను కూడా సోషల్ మీడియాలోకి లాగుతూ బూతు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బాధపడుతూ ఎమోషనల్ వీడియో చేసింది . దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలో కండక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ..” మంచి అవకాశం వచ్చింది నాలోని టాలెంట్ బయట పెట్టడానికి ఆ షో కి వెళ్లాను . డ్యాన్న్స్ చేశాను. చాలామంది నన్ను పొగుడుతున్నారు థాంక్స్.. కానీ కొందరు మాత్రం మా వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఆపేయండి . నాలోని టాలెంట్ చూసి మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు . దాన్ని మీరు నాశనం చేయకండి. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు . ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు .మా ఆయనను ట్రోల్ చేయడం ఆపేయండి ప్లీజ్.. ఇకపై ఇలాంటివి చేయరని ఆశిస్తున్నాను. మా ఆయనను తిట్టకండి” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news