Moviesషాక్‌... రిలీజ్‌కు ముందే ' లైగ‌ర్‌ ' కు పెద్ద దెబ్బ...

షాక్‌… రిలీజ్‌కు ముందే ‘ లైగ‌ర్‌ ‘ కు పెద్ద దెబ్బ త‌గ‌ల‌బోతోందా…!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా లైగ‌ర్. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు అయితే లైగర్ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయ్యి… విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ బయటికి వచ్చిందో.. అప్పటినుంచి లైగ‌ర్ నామస్మరణ భారీగా జరుగుతూ వచ్చింది. పైగా ఈ సినిమా నిర్మాణంలో హీరోయిన్ ఛార్మితో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కర‌ణ్‌జోహార్ కూడా భాగస్వామిగా ఉండడంతో లైగ‌ర్ పై నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

దీనికి తోడు ఇటీవల వరుసగా బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో సౌత్ ఇండియా సినిమాలు.. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా అక్కడ ఏకంగా వెయ్యకు పైగా స్క్రీన్‌లో ప్రదర్శిస్తున్నారు. దీనిని బట్టి తెలుగులో చిన్న హీరోల సినిమాలకు కూడా కథా బలం ఉంటే బాలీవుడ్‌లో ఎలా ? దుమ్మురేగుతుందో చూస్తూనే ఉన్నాం.

ఇక ఈనెల 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న లైగ‌ర్ బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. లైగర్ అడ్వాన్స్ బుకింగ్‌ల‌తో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాపై దేశమంతటా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజ్ కి ముందే లైగ‌ర్ ను కొత్త భయం వెంటాడుతోంది. ఇప్పుడు ఆ టెన్షన్ తో లైగ‌ర్ టీం కూడా తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో పరిస్థితిలు ఎలా ? ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాపై ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే రిలీజ్‌కు ముందు నుంచే నడుస్తోంది. ఈ నెగిటివ్ ట్రెండ్ ఆ సినిమా ఫలితాలపై తీవ్రంగా ప్రభావితం చూపేంత పెద్ద ఎత్తున నడుస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్ సినిమాలపై రిలీజ్‌కు ముందు నుంచే భారీ ఎత్తున నెగిటివ్ ట్రెండ్ గట్టిగా కంటిన్యూ అయింది. అమీర్‌ఖాన్ సినిమాపై అయితే ఏకంగా బిజెపి పెద్ద స్థాయిలో యుద్ధం చేసింది. ఆ సినిమాను అందరూ బహిష్కరించాలని చాలామంది బిజెపి నేతలు కూడా పిలుపునిచ్చారు. ఇక అక్షయ్ కుమార్ సినిమాకు కూడా ఈ నెగటివ్ ప్రచారం తప్పలేదు. కారణం ఏదైనా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు లైగర్‌పై కూడా సోషల్ మీడియాలో ఇదే తరహాలో నెగిటివ్ ట్రెండ్ అయితే నడుస్తోంది.

అసలే సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలకు షాక్ ఇస్తున్నాయి. చివరకు నిఖిల్ లాంటి చిన్న హీరో సినిమా కూడా అమీర్ ఖాన్ – అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోల సినిమాల వసూళ్లను దాటేసింది. ఇప్పుడు లైగర్ తమపై ఎక్కడ దండయాత్ర చేస్తుందో ? అన్న భయంతో బాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల‌తో పాటు బాలీవుడ్ విశ్లేషకులు సైతం ఈ సినిమాపై అండర్ కరెంటుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్టు భోగోట్ట. మరి ఈ యాంటీ ప్రచారాన్ని లైగర్ సినిమా ఎలా ? ఎదుర్కొంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news