Movies"ఆయనకు ఆస్కార్ వస్తే మెంటల్ ఎక్కిపోద్ది"..వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ కామెంట్స్..!!

“ఆయనకు ఆస్కార్ వస్తే మెంటల్ ఎక్కిపోద్ది”..వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ కామెంట్స్..!!

తారక్ లాంటి స్టార్ హీరో పై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . నిజానికి తారక్ తో పోలిస్తే విజయ్ దేవరకొండ చిన్న హీరోనే.. పట్టుమంటే పది సినిమాలు కూడా చేసి ఉండడు .అలాంటి హీరో..పాన్ ఇండియా స్టార్ హీరో తారక్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ ఇద్దరు కలిసి చాలా చక్కగా నటించారు. ఎంతో మంది స్టార్ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. ఆస్కార్ నామినేషన కి గాను.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ సెలెక్ట్ అయినట్టు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా తారక్ పెర్ఫార్మెన్స్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తారక్ కి ఆస్కార్ అంటూ సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.

అయితే “తారక్ కు ఆస్కార్ వస్తే మెంటల్ అసలు” అంటూ విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ మూవీ.. ఈనెల 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఆర్ఆర్ఆర్ సినిమా గాను తారక్ కు ఆస్కార్ అవార్డు వస్తే మెంటల్ అసలు. మన దేశానికి ఆస్కార్ వస్తే ఆ రేంజ్ ఆ లెవెల్ మరో లెవెల్ లో ఉంటుంది . మరీ ముఖ్యంగా తారక్ అన్న లాంటి గొప్ప నటుడుకి ఆస్కార్ వచ్చిందంటే అంతకన్నా గొప్ప గౌరవం మరొకటి ఉండదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా బాగా నటించారు ఒక్క ముక్కలో చెప్పాలంటే డెడ్లీ పెర్ఫార్మెన్స్” అంటూ ఒకవేళ ఆస్కార్ వస్తే అది నిజంగా మ్యాజిక్ లా ఉంటుంది చాలా బాగుంటుంది ..మన ఇండియన్ సినిమా స్థాయి ఇంకా పెరుగుతుంది” అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news