Movies' బింబిసార ' మ‌రో రికార్డ్‌... క‌ళ్యాణ్‌రామ్ కెరీర్లో ఫ‌స్ట్ టైం...

‘ బింబిసార ‘ మ‌రో రికార్డ్‌… క‌ళ్యాణ్‌రామ్ కెరీర్లో ఫ‌స్ట్ టైం రేర్ ఫీట్‌..!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన లేటెస్ట్ సినిమా బింబిసార‌. ఈ నెల 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు మ‌రోవైపు సీతారామం వంటి హిట్ సినిమా ఉన్నా కూడా హిట్ అవ్వ‌డంతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద రెండో రోజు కూడా స్ట‌డీగా వసూళ్లు రాబ‌డుతోంది. ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ హీరోగానే కాకుండా, ఇటు నిర్మాత‌గా కూడా ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ సినీ కెరీర్‌లో అరుదైన రికార్డులు సొంతం అయ్యాయి.

ఫ‌స్ట్ టైం క‌ళ్యాణ్ న‌టించిన ఓ సినిమా రు. 50 కోట్ల గ్రాస్ క్ల‌బ్‌లోకి చేరింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా వ‌సూళ్లు గ్రాస్ ప‌రంగా రు. 60 కోట్ల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. ఇక షేర్ ప‌రంగా చూస్తే బింబిసార రు. 31 కోట్ల‌కు పైగానే దాటేసింది. ఇక ఓవ‌ర్సీస్‌లో క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. 11 రోజుల ఏరియా వైస్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 9.79 కోట్లు
సీడెడ్ – 6.41 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 4.21 కోట్లు
ఈస్ట్ – 1.68 కోట్లు
వెస్ట్ – 1.26 కోట్లు
గుంటూరు – 1.96 కోట్లు
కృష్ణా – 1.43 కోట్లు
నెల్లూరు – 0.82 ల‌క్ష‌లు
—————————————-
ఏపీ + తెలంగాణ = 27.56 కోట్లు ( 43.32 కోట్ల గ్రాస్‌)
—————————————

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 31 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా గ్రాస్ వ‌సూళ్లు రు. 54 కోట్లు దాటేశాయి. ఈ రోజు వ‌సూళ్లు కూడా క‌లిపితే వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ రు. 60 కోట్లు ఉండొచ్చు. ఇక ఫ‌స్ట్ వీక్ ఏపీ, తెలంగాణ‌లో 685 థియేట‌ర్ల‌లో న‌డిచిన ఈ సినిమా ఇప్పుడు సెకండ్ వీక్‌లో కూడా 350 + థియేట‌ర్ల‌లో న‌డుస్తోంది. ఏదేమైనా సెకండ్ వీక్ సీతారామం, కార్తీకేయ 2 స్ట‌డీగా హిట్ టాక్‌తో న‌డుస్తున్నాం బింబిసార అంతే స్టడీగా న‌టుస్తుండ‌డంతో ఈ సినిమాకు మ‌రిన్ని లాభాలు రానున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news