Moviesయస్..అది నిజమే..కావాలంటే చూసుకోండి..జబర్ధస్త్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!!

యస్..అది నిజమే..కావాలంటే చూసుకోండి..జబర్ధస్త్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!!

సీనియర్ హీరోయిన్ రోజా..ఇప్పుడంటే రాజకీయాలో పది సినిమాలను వదిలేసారు కానీ, ఒకప్పుడు ఆమె సినిమాలు ఎలాంటి హిట్స్ అందుకున్నాయో అందరికి తెలిసిందే. స్టార్ హీరోలతో సమానంగా ఆడి పాడి అలరించిన ఈ బ్యూటీ..రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంది. అప్పట్లో రోజా సినిమాలు వస్తున్నాయి అంటే ధియేటర్స్ దగ్గర రచ్చ మాములుగా ఉండదు. టాలీవుడ్ కి బడా బడా బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించింది రోజా.

ఆ తరువాత పెళ్ళి పిల్లలు..తో బిజీ అయిపోయి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నింది. అప్పుడే రాజకీయాలోకి ఎంటర్ అయ్యింది. ఆ తరువాత మెల్లగా సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసి..హీరోయిన్స్ కి తల్లిగా నటించి మెప్పించింది. అదే టైంలో జబర్ధస్త్ షోకి జడ్జీగా కూడా తనదైన స్టైల్ లో మార్కులు వేస్తూ.. పంచులు వేస్తూ నవ్వుతూ..నవ్వించింది. కాగా, మినిస్టర్ అయ్యాక ఆమె జబర్ధస్త్ నుండి తప్పుకున్నింది. తన జీవితం ప్రజలకే అంకితం అంటూ సినిమాలకి కూడా గుడ్ బై చెప్పేసింది.

అయితే దాదాపు 10 ఏళ్ళకు పైగా జబర్ధస్త్ షో కి జడ్జీగా చేసిన రోజా కొట్లల్లో సంపాదించుకుందని ఓ టాక్ బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అయితే ఈమధ్య కోట్లు ఖర్చు చేసి ఓ కాస్ట్లీ కార్ ను రోజా కొనుకోవడంతో..రోజా బాగానే వెనక వేసుకుందని ఓ వివాదం నడుస్తోంది. అక్రమ్ సంపాదనతో కార కొన్నారంటూ.. కొందరు ఆమెను టార్గెంట్ చేసి ట్రోల్ చేసారు. దీని పై ఘాటుగా స్పందించింది రోజా. “జబర్థస్త్ జడ్జిగా ఎన్నో సంవత్సరాలు ఉన్నాను..ఇన్నాళ్ల నా కెరీర్ లో 150 కి పైగా సినిమాలు చేశాను. అక్కడ లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నాను. ఇది అందరకి తెలిసిన విషయమే కదా. కావాలంటే నేను కట్టే ఇన్ కమ్ టాక్స్ కు సంబంధించి ఇన్ ఫర్ మేషన్ మీరు చూసుకోవచ్చు”..అంటూ ఘాటుగానే రెస్పాండ్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news