Moviesహీరో క‌ళ్యాణ్‌రామ్ భార్య బ్యాగ్‌గ్రౌండ్ ఏంటి... ఆమె ఆ టాలీవుడ్ స్టార్‌కు...

హీరో క‌ళ్యాణ్‌రామ్ భార్య బ్యాగ్‌గ్రౌండ్ ఏంటి… ఆమె ఆ టాలీవుడ్ స్టార్‌కు పిచ్చ ఫ్యానా..!

నందమూరి కల్యాణ్‌ రామ్ తాజా సినిమా బింబిసార బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఆ అంచ‌నాలు అందుకుంటూ బింబిసార ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇక క‌ళ్యాణ్‌రామ్ బింబిసార మూడు రోజుల‌కే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసి రేర్ ఫీట్ సాధించ‌డంతో ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్ ట్రెండింగ్‌లో ఉన్నాడు.

క‌ళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ, భార్య గురించి కూడా ఎక్కువుగా సెర్చింగ్ జ‌రుగుతోంది. ఇక క‌ళ్యాణ్‌రామ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు. క‌ళ్యాణ్‌రామ్ కూడా సింపుల్‌గా ఉంటాడు. అత‌డి ఫ్యామిలీ విష‌యాలు కూడా పెద్ద‌గా బ‌య‌ట పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు నెటిజ‌న్లు బింబిసార హిట్ నేప‌థ్యంలో క‌ళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ గురించి సెర్చింగ్ చేస్తుండ‌డంతో పాటు తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

క‌ళ్యాణ్‌రామ్ భార్య పేరు స్వాతి. స్వాతికి క‌ళ్యాణ్‌కు 2006 ఆగస్టు 10న వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అయితే క‌ళ్యాణ్ పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్ట‌ప‌డ‌డంతో పాటు ఆమెనే పెళ్లి చేసుకుంటాన‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట‌. ఆమె డాక్ట‌ర్‌. ఇక స్వాతి వాళ్ల‌ది కూడా సంప‌న్న కుటుంబ‌మే. స్వాతి తండ్రికి ప‌లు వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ల ఫ్యామిలీ ఫార్మా కంపెనీలో పెద్ద ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి.

ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలో కొన‌సాగుతున్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ కంపెనీ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా అక్క‌డే జ‌రిగాయ‌ట‌. ఇక స్వాతి సోద‌రుడే హ‌రి. ముందు నుంచి క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్ వ్య‌వ‌హారాలు చూసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.

ఇక బింబిసారాకు కూడా హ‌రియే నిర్మాత‌. బాధ్య‌త‌లు అన్నీ క‌ళ్యాణ్ హ‌రి చేతుల్లోనే పెట్టేశాడు. ఇక కళ్యాణ్‌రామ్‌-స్వాతి దంపతులకు అదైత, శౌర్య‌రామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక స్వాతి టాలీవుడ్ కింగ్ నాగార్జున‌కు చ‌దువుకునే రోజుల్లో పిచ్చ ఫ్యాన్‌. నాగార్జున సినిమా రిలీజ్ అయితే ఫ‌స్ట్ డే కాలేజ్ ఎగ్గొట్టి మ‌రీ చూసేద‌ట స్వాతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news