Moviesబిగ్ బ్రేకింగ్‌: షూటింగ్‌లో ప్ర‌మాదం... హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు..!

బిగ్ బ్రేకింగ్‌: షూటింగ్‌లో ప్ర‌మాదం… హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు..!

కోలీవుడ్‌లో స్టార్ హీరోల‌లో యంగ్ & మాస్ హీరో విశాల్. స్వ‌త‌హాగా తెలుగు వ్య‌క్తి అయిన విశాల్ ముందు నుంచి చెన్నైలో సెటిల్ అయ్యి కోలీవుడ్‌పై కాన్‌సంట్రేష‌న్ చేశాడు. దీంతో విశాల్ త‌మిళంలో బాగా పాపుల‌ర్ అయ్యాడు. త‌మిళంలో సూప‌ర్ పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు త‌న ప్ర‌తి సినిమాతో ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చేరువ అయ్యాడు. విశాల్ అన్ని సినిమాలు తెలుగులోకి కూడా డ‌బ్ అయ్యి మంచి వ‌సూళ్లే రాబ‌డుతున్నాయి.

పైగా విశాల్ ఇటీవ‌ల వ‌రుస‌గా వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే విశాల్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా లాఠీ అనే సాలిడ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత త‌న నెక్ట్స్ సినిమా మార్క్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఇది కూడా యాక్ష‌న్ సినిమాయే.

ఇప్ప‌టికే లాఠీ సినిమా షూటింగ్‌లో ప‌లుమార్లు గాయ‌ప‌డ్డ విశాల్ ఇప్పుడు కూడా మ‌రో యాక్ష‌న్ సీక్వెన్స్ చేస్తుండ‌గా తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. తాజా ప్ర‌మాదంలో విశాల్‌కు తీవ్ర గాయాలు అయిన‌ట్టుగా తమిళ సినిమా వ‌ర్గాలు చెపుతున్నాయి. ఏదేమైనా విశాల్ త‌న సినిమాల్లో యాక్ష‌న్ సీక్వెన్స్ విష‌యంలో చాలా పెద్ద రిస్క్‌లే చేస్తున్నాడు.

ఏదేమైనా విశాల్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఇప్పుడు త‌మిళ సినిమా వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆయ‌న అభిమానులు మాత్రం విశాల్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్‌.జె. సూర్య విల‌న్‌గా న‌టిస్తుండ‌గా… రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news