Moviesప్రేమ‌లో మోస‌పోయి చ‌నిపోయిన హీరోయిన్లు వీళ్లే..!

ప్రేమ‌లో మోస‌పోయి చ‌నిపోయిన హీరోయిన్లు వీళ్లే..!

ప్రేమ… ఎవరి చేతనైనా ఎలాంటి పనైనా చేపిస్తుంది. ఎంతటి స్థాయిలో ఉన్న కూడా ప్రేమ కోసం అలమటించకుండా ఉండలేరు. పేదవాడి నుంచి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరిని కదిలించేది ప్రేమ మాత్రమే. ఇక మన స్టార్ హీరోయిన్స్ జీవితాల్లో కూడా అనేక మందికి ప్రేమ కథలు ఉన్నాయి. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. అయితే అందరూ ఫెయిల్యూర్‌ని ఒకేలా హ్యాండిల్ చేయలేరు. తమను ప్రేమించి మోసం చేశారని లేదా తమను మోసం చేయడానికి ప్రేమించారని కొంతమంది భావించి తమ జీవితాలను సైతం త్యాగం చేసిన వారు ఉన్నారు. అలా తమను ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కన్నుమూసిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

మోనాల్ :
సిమ్రాన్ చెల్లెలైన మోనాల్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు తన హవాను చాటింది. కానీ ఒక తమిళ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి చివరికి తన జీవితాన్ని అంతం చేసుకుంది. మొదట అతడిని ప్రేమించకపోవడంతో వెంటపడి మరి ఒప్పించి మోనాల్ ని ప్రేమలో దింపాడు. ఆమెతో కలిసి కొన్నాళ్లు ప్రయాణం చేశాక ఆమెను మోసం చేసి, చివరికి మోనాల్ ఫోన్ కూడా తీయకపోవడంతో ఆమె ఆ బాధను తట్టుకోలేక బలవన్మరణం చేసుకుని కన్నుమూసింది.

జియాఖాన్ :
కోటి ఆశలతో సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని అమెరికా నుంచి వచ్చింది జియాఖాన్. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో అలనాటి హీరో ఆదిత్య పంచోలీ కుమారుడైన సూరజ్ పంచోలితో ప్రేమ వ్యవహారం నడిపించింది. చివరికి గర్భవతి కూడా అయింది కానీ కొన్ని కారణాలతో సూరజ్ పంచోలి ఆమెను దూరం పెట్టగా, ఆ విషయం ఆమె తట్టుకోలేకపోయింది దాంతో తనవు చాలించింది.

ప్రత్యూష బెనర్జీ :
చిన్నారి పెళ్ళికూతురు నటి అయిన ప్రత్యూష బెనర్జీ సైతం గర్భవతిగా ఉండి కన్నుమూయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాను ఎంతగానో ప్రేమించి, నమ్మి సహజీవనం చేసిన రాహుల్ రాజ్ అనే తోటి నటుడు ఆమెను మోసం చేయడంతో ప్రత్యూష తట్టుకోలేకపోయింది దాంతో ఆమె ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.

ఫటాఫట్ జయలక్ష్మి :
తమిళ సినిమా రంగంలో పీక్ టైం లో ఉన్నటువంటి జయలక్ష్మి ఒక హీరోతో ప్రేమ కారణంగా బలవర్మనానికి పాల్పడింది. అప్పటికే పెళ్లయినా కూడా మరో హీరోతో ప్రేమలో పడి అది దక్కకపోవడంతో జయలక్ష్మి తనువు చాలించింది.

శోభ :
తమిళ సినిమా రంగంలో ఒక అలలాగా వచ్చి వెళ్ళింది నటి శోభ. దర్శకుడు బాలు మహేంద్ర ని ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభ కేవలం 17 ఏళ్ల వయసులోనే ఉరిపోసుకొని చనిపోయింది. బాలు మహేంద్ర కు ఉన్న అక్రమ సంబంధాలు మాత్రమే ఆమె చావుకు కారణం అనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. వాటిలో నిజాలేంటో తెలియకపోయినా అందరూ వాటిని బలంగా నమ్ముతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news