Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్..!!

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్..!!

ఎవరు ఊహించిన విధంగా టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన వరకు పూర్తిగా జరుగుతుందంటూ సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది. కాగా ఇప్పుడు కాగా కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్ మారుతి క్రేజీ ప్రాజెక్ట్ సినిమా పూజా కార్యక్రమాలు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగనున్నట్లు సమాచారం.

నిజానికి ఈ సినిమా ప్రొడ్యూసర్ గా డి వి వి దానయ్య ఉండాలని అనుకున్నారట. కానీ మారుతి పక్కా కమర్షియల్ సినిమా చూసిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది. దానయ్య స్థానంలో ఈ ప్రాజెక్టుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నట్టు విశ్వసినీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. రేపు అనగా గురువారం ఆగస్టు 25వ తేదీ ఈ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్లు సమాచారం. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్ అని అంటున్నారు సినీ ప్రముఖులు.

కాగా, బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయన నుండి వస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి. నిజానికి మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే ఎవ్వరు నమ్మడం లేదు. ఇంత చిన్న డైరెక్టర్ తో..ప్రభాస్ సినిమా చేస్తున్నాడా అని డౌట్లు పడ్డారు. అలాంటి వాళ్ళకి రేపటి పూజా కార్యక్రమంలో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నాడు ప్రభాస్. కాగా , ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నవంబరు లో ప్రారంభం కానుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news