Moviesయస్..ఆ హీరోయిన్ తో నా రిలేషన్ నిజమే.. బిగ్ బాంబ్ పేల్చిన...

యస్..ఆ హీరోయిన్ తో నా రిలేషన్ నిజమే.. బిగ్ బాంబ్ పేల్చిన జగపతిబాబు..!

సినీ ఇండస్ట్రీ అన్నాక గాసిప్ లు,, రూమర్లు సర్వసాధారణం. హిట్ పడని హీరో హీరోయిన్లు ఉంటారేమో కానీ గాసిప్స్ రూమర్స్ స్ప్రెడ్ అవ్వని ఆర్టిస్టులు ,హీరోలు, హీరోయిన్లు.. ఎవ్వరూ లేరు .ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా సరే వాళ్ళ పై ఖచ్చితంగా ఏదో ఒక్క గాసిప్ వచ్చి ఉంటుంది . అలా వస్తేనే వారు పాపులర్ అయిన్నట్లు అంటూ ఓ పిచ్చి నమ్మకం ఉంది ఇండస్ట్రీలో. అయితే ఫ్యామిలీ హీరో జగపతిబాబు పై కూడా ఓ రూమర్ వైరల్ అయ్యింది. ఫ్యామిలీ హీరో జగపతిబాబు చాలా సైలెంట్ గా ఉంటారు. ఇండస్ట్రీలో తన పని తాను చేసుకోపోయే హీరోలల్లో జగపతిబాబు ఒకరు అంటూ ఓ మంచి పేరుంది.

అలాంటి హీరోపై కూడా గాసిప్ లు వచ్చాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే జగపతిబాబుతో ఎఫైర్ ఉందంటూ వచ్చిన ఏకైక హీరోయిన్ సౌందర్యనే. వీళ్ళ కాంబినేషన్ భలే ఉంటుంది. రియల్ లైఫ్ భార్యాభర్తల లాగే ఉంటారు. చాలా సహజ సిద్ధంగా నటిస్తారు. వీళ్ళ పర్ఫామెన్స్ చూసి కొందరు నిజంగానే భార్య భర్తలు ఏమో అని పొరపాటు కూడా పడ్డారు . అలాంటి మూవీస్ వీళ్ల లిస్టులో బోలెడు ఉన్నాయి. అప్పట్లో తెరపై ఈ జంట కనిపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే వాళ్ళు . ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా నవ్వుకుంటూ చూసుకునే వాళ్ళు .

మరి ముఖ్యంగా భార్యాభర్తలు అయితే ఈ సన్నివేశం మన లైఫ్ లో కూడా జరిగింది కదా అంటూ అనుకునే వాళ్ళు .అంత బాగా జనాల్లోకి ఎక్కిపోయింది ఈ జంట .అందుకే కాబోలు జగపతి బాబుతో సౌందర్య ఎఫైర్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో జగపతిబాబు ఇలాంటి రూమర్స్ పై స్పందించారు.. తనదైన స్టైల్ లో కామెంట్ చేసారు.

జగపతిబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” అవును నేను విన్నాను నాకు సౌందర్యకి ఎఫైర్ ఉందంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి .మేము స్నేహితులు మంచి స్నేహితులు .ఆ విషయం తనకి తెలుసు నాకు తెలుసు. బహుశా జనాలు మా మధ్య అఫైర్ ఉంది అనుకోవడానికి కారణం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని ..ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది. ఎందుకంటే సౌందర్య అన్నయ్య నాకు మంచి ఫ్రెండ్. మేము చాలా క్లోజ్ అందుకే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి వెళ్తాం ..వారి ఫ్యామిలీ అంతా మా ఇంటికి వస్తుంది. ఈ చనువు చూసి బహుశా కొందరు మా మధ్య ఏదో సంబంధం ఉందంటూ అపోహ పడినట్లు ఉన్నారు. కానీ మేము మంచి స్నేహితులమే. నా లైఫ్ లో నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతూనే ఉంటాను. ఇక ఈ రూమర్స్ అంటారా ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను ..ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను” అంటూ తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు జగపతిబాబు. ప్రస్తుతం జగపతిబాబు ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news