Moviesవారెవ్వా: ఆ ఆఫర్ తో సునీల్ దశ తిరిగిపోయిందిపో..కేకోకేక అంతే..!!

వారెవ్వా: ఆ ఆఫర్ తో సునీల్ దశ తిరిగిపోయిందిపో..కేకోకేక అంతే..!!

సినీ ఇండస్ట్రీలో కమెడియన్.. సునీల్ కు ఉండే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కమెడియన్ గా ఈయన సినిమాలో ఉంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో సునీల్ నటన ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సినిమాల్లో హీరో కన్నా సునీల్ క్యారెక్టర్ ని అద్భుతంగా రాసుకునే వాళ్ళు డైరెక్టర్లు అంత మంచి టాలెంట్ ఉంది సునీల్ కి. బడా బడా ఆఫర్లతో కెరీర్ పీక్స్ లో ఉండగానే సునీల్ హీరోగా ఎంటర్ అవ్వాలని రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు.

ఈ క్రమంలోని కమెడియన్ నుంచి హీరోగా మారి వరుస సినిమాలను డిజాస్టర్ గా మార్చుకున్నాడు. అంతేకాదు సునీల్ హీరోగా నటించి హిట్ అయిన ఏకైక సినిమా మర్యాద రామన్న. అది కూడా రాజమౌళి పుణ్యమే. రాజమౌళి డైరెక్ట్ చేయకుండా ఉంటే సునీల్ ఖాతాలో ఇప్పటివరకు హీరోగా ఒక్క హిట్ కూడా పడేది కాదు. కాగా సునీల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఈ మధ్యనే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ కమెడియన్ గా మారి తనదైన స్టైల్ లో నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు.

రీసెంట్ గా పుష్ప సినిమాలో మంగళం శీను అనే పాత్రను పోషించి తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. కాగా ప్రజెంట్ ఇప్పుడు సునీల్ చేతుల్లో మూడు బడా ఆఫర్లు ఉన్నాయి. ఒక్కటి పుష్ప2 అల్లు అర్జున్ తో మళ్లీ చేయబోతున్నాడు. రెండోది ఋఛ్15 రాంచరణ్ శంకర్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఇలా ముగ్గురు మెగా హీరోలతో నటిస్తూ కెరియర్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ మూడు సినిమాలు హిట్ అయ్యే సినిమాలే . దీంతో ఈ సినిమా లు హిట్ అయితే సునీల్ కెరియర్ మళ్ళీ పిక్స్ వెళ్తుంది అనడంలో సందేహం లేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news