Movies"ఆంటీ" ఎఫెక్ట్ స్టార్ హీరో సినిమా నుండి అనసూయ అవుట్..!?

“ఆంటీ” ఎఫెక్ట్ స్టార్ హీరో సినిమా నుండి అనసూయ అవుట్..!?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనసూయ ఆంటీ. ఇప్పుడు ఇదే బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో తీసిన సినిమా లైగర్ .ఈ సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకే ..అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ కౌంటర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది . ఆ పోస్ట్ లో అనసూయ విజయ్ దేవరకొండను పరోక్షకంగా విమర్శించింది అంటూ విజయ్ ఫ్యాన్స్ అనసూయను ఆంటీ ఆంటీ ఆంటీ అంటూ పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్నారు.


మొదటినుంచి తనని ఒక మాట అన్న పడని అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. తనను ఆంటీ అంటూ పచ్చి బూతులు తో ట్రోల్ చేస్తున్న వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా అనసూయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అనసూయ పై చాలా మంది డైరెక్టర్స్ ఫైర్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అనసూయ ముందు నుంచే ఒక మాట అన్న పడదు అలాంటిది మరి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోని అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?అంటూ విజయ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు స్టార్ ప్రముఖులు.

దీంతో అనసూయ ఖాతాలో నుంచి ఓ సినిమా ఎగిరిపోయినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో నటించిన అనసూయ కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న పుష్ప2 షూటింగ్లో కూడా పాల్గొనబోతుంది. అయితే రీసెంట్ గా ఆంటీ వివాదంతో సుకుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అనసూయను తప్పించి అనసూయ ప్లేస్ లో మరో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇదే విషయం అనసూయ కి చెప్పగా అనసూయ లైట్ గా తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. మరి ఏమో ఇంకా ఆంటీ వివాదంతో అనసూయ ఎన్ని మంచి మంచి ఆఫర్లు పోగొట్టుకోవాలో చూడాల్సిందే..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news