MoviesTL రివ్యూ: కోబ్రా

TL రివ్యూ: కోబ్రా

టైటిల్‌: కోబ్రా
నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు
సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్
ఎడిటింగ్‌: భువన్ శ్రీనివాసన్
మ్యూజిక్‌: ఏఆర్ రెహమాన్
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్
దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
రిలీజ్ డేట్‌: 31 ఆగ‌స్టు, 2022

చియాన్ విక్ర‌మ్ హీరోగా, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెర‌కెక్కిన సినిమా కోబ్రా. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మూడేళ్ల నుంచి ఊరిస్తూ వ‌స్తోంది. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఎన్నో అవాంత‌రాలు దాటుకుని ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి కోబ్రాతో విక్ర‌మ్ ఫాంలోకి వ‌చ్చాడో లేదో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ఒరిస్సాలో ముఖ్య‌మంత్రి, స్కాట్లాండ్‌లో ఉన్న యువ‌రాజు, ర‌ష్యాలో ఓ మంత్రితో పాటు కొంద‌రు విదేశీ ప్ర‌ముఖులు హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేశారా ? అని ఆరా తీస్తోన్న క్ర‌మంలో వీటికి కోల్‌కొత్తాలోని లెక్క‌ల మాస్టార్ మ‌ది ( విక్ర‌మ్‌)కు లింక్ ఉంద‌ని తెలుస్తుంది. ఈ విష‌యాన్ని ఇంట‌ర్‌పోల్ ఆఫీసర్ అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనుమానిస్తారు. ఇదిలా ఉంటే ఈ కేసు కోసం ఓ లెక్క‌ల స్టూడెంట్ జూడీ ( మీనాక్షి గోవింద్‌)కు త‌మ టీంలో చోటి స్తారు. ఆమె ఎవ‌రో కాదు మ‌దిని ప్రేమించే భావ‌న ( శ్రీనిధి శెట్టి) స్టూడెంట్‌. అయితే వ‌రుస‌గా హ‌త్య‌కు గుర‌వుతోన్న వారికి వేల కోట్ల సామ్రాజ్యాధినేత రిషి ( రోష‌న్ మాథ్యూ)తో లింక్ ఉంటుంది. అస‌లు ఈ హ‌త్య‌లు నిజంగానే మ‌ది చేశాడా ? మ‌దికి మ‌రో విక్ర‌మ్ అయిన ఖ‌దీర్‌కు ఉన్న లింక్ ఏంటి ? అస‌లు ఈ క‌థ‌లో మ‌ది, ఖ‌దీర్‌ల‌ను చంపేందుకు ట్రై చేస్తోంది ? ఎవ‌రు అన్న‌దే ఈ సినిమా స్టోరి.

విశ్లేష‌ణ :
విక్ర‌మ్ సినిమాలు అంటేనే ఎప్పుడు గెట‌ప్‌లు డిఫ‌రెంట్‌, స్టోరీలు కొత్త‌గా ఉంటాయి. అప‌రిచితుడు, ఇంకొక్క‌డు ఇలా ఉంటాయి. ఇక కోబ్రా విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు ఫుల్ శాటిస్‌పై సినిమా అని చెప్పాలి. ఇదో కాన్సెఫ్ట్‌డ్ ఓరియంటెడ్ సినిమా. సినిమా స్టార్టింగ్‌నే క‌థ‌లోకి వెళ్లిపోతుంది. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. క‌థ న‌డుస్తున్న‌కొద్ది చాలా ఆస‌క్తిగానే న‌డుస్తుంటుంది. దీనికి తోడు విక్ర‌మ్ గెట‌ప్స్‌,న‌ట‌న‌, ఏఆర్‌. రెహ్మ‌న్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటాయి.

క‌థ అంతా ఆస‌క్తిగా ఉన్నా సెకండాఫ్‌లో ప్లాట్ నెరేష‌న్‌, క్లైమాక్స్‌కు వ‌చ్చే స‌రికి మాత్రం రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా మార్చేశాడు ద‌ర్శ‌కుడు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, ఇన్వెస్ట్‌గేష‌న్ బాగుంటుంది. ఇక నేప‌థ్య సంగీతం, అధీరా సాంగ్ థియేట‌ర్ల నుంచి ప్రేక్ష‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా గుర్తుండి పోతాయి. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. ప్ర‌తి ప్రేమ్ చాలా రిచ్‌గా ఉంది. దిలీప్ సుబ్బ‌రామ‌న్ స్టంట్స్ బాగున్నాయి.

అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్ష‌కుడికి అర్థం కావు. క‌న్‌ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో మ‌రి ఇరిటేష‌న్ వ‌చ్చిన‌ట్టుగా అనిపిస్తుంది. ఏదో ఇంటిలిజెన్స్ తీయాల‌ని అనుకున్నా.. అది తెర‌మీద గ్రిప్పింగ్‌గా, ఆస‌క్తిగా అయితే చెప్ప‌లేదు.

 

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
న‌టీన‌టుల పెర్పామెన్స్ విష‌యానికి వ‌స్తే విక్రమ్ నటనకు వంక పెట్టలేని ప‌రిస్థితి. క‌థ‌లోనూ, పాత్ర‌లోనూ జీవించేస్తాడు. ఈ సినిమాలో కూడా విక్ర‌మ్ కొన్ని గెట‌ప్‌ల‌లో క‌నిపిస్తాడు. ఇన్వెస్ట్‌గేష‌న్‌, క్లైమాక్స్ సీన్ల‌లో మాత్రం అద్భుతంగా న‌టిస్తాడు. న‌టుడిగా మ‌రోసారి వైవిధ్యం చూపించాడు. కేజీయ‌ఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఎమెష‌న‌ల్ సీన్ల‌లో ఆక‌ట్టుకుంది. మృణాళిని రవి పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్నా తేలిపోయింది. విల‌న్ రోష‌న్ మాథ్యూ ఆక‌ట్టుకున్నాడు. ఇక మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌కు కీల‌క పాత్ర ద‌క్కింది. మియా జార్జ్, కె.ఎస్. రవికుమార్, జాన్ విజయ్ తదితరులు ఆయా పాత్రలకు బాగా సూట్ అయ్యారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు అధీరా సాంగ్‌.. ఎలివేష‌న్ సీన్ల‌లో మ్యూజిక్ అదిరిపోయింది. ఇక సినిమాటోగ్ర‌ఫీ సినిమాకే హైలెట్‌. విజువ‌ల్స్ సూప‌ర్‌. నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయి. ఫైట్స్ దిమ్మ‌తిరిగిపోయేలా ఉన్నాయి. ఎడిటింగ్ 3 గంట‌లు ఉండ‌డంతో ఆ ర‌న్ టైంను సెకండాఫ్‌లో కొంద‌రు భ‌రించ‌లేక‌పోయారు. అయితే అజ‌య్ జ్ఞాన‌ముత్తు మంచి క‌థ తీసుకున్నా దానిని అంద‌రికి క‌నెక్ట్ అయ్యేలా ఇంకా బాగా చెప్పి ఉండాల్సింది. క‌థ‌లో డెప్త్ ఉన్నా సీన్ల‌లో క‌న్‌ఫ్యూజ్‌, స్క్రీన్ ప్లే క‌న్‌ఫ్యూజ్ కొన్ని వ‌ర్గాల‌కు క‌నెక్ట్ కాదు.

ఫైన‌ల్‌గా…
కోబ్రా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌… విక్ర‌మ్ ఈజ్ బ్యాక్‌

కోబ్రా రేటింగ్ : 2.5 / 5

Latest news