Moviesబిగ్ షాకింగ్: సమంతకు విడాకులు ఇవ్వమని చెప్పింది ఆ స్టార్ హీరోనే..ఒక్క...

బిగ్ షాకింగ్: సమంతకు విడాకులు ఇవ్వమని చెప్పింది ఆ స్టార్ హీరోనే..ఒక్క ట్వీట్ తో అసలు మ్యాటర్ లీక్..!!

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత విడిపోయి దాదాపు 10 నెలలు కావస్తుంది. కానీ, ఇంకా మీడియాలో వీళ్ళ విడాకుల మ్యాటర్ హీట్ పెంచుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు కేవలం ట్వీట్స్ తో ఇన్స్టాలో అక్కినేని వారిని టార్గెట్ చేసిన సమంత ఇప్పుడు నేరుగా కాఫీ విత్ కరణ్ షో లో “మా విడాకులు కూల్ గా ఏం జరగలేదు”..అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. అక్కడితో ఆగకుండా నాగచైతన్య పై ఎంత కసి ఉందో పరోక్షంగా పదునైన వస్తువులను మా గదిలో ఉంచాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కనీసం నాగ చైతన్య పేరుని పలకడానికి కూడా ఇష్టపడలేదు ఈ అమ్మడు.

అయితే, సమంత ఇన్ని మాటలు అన్నా కూడా ఇప్పటి వరకు చైతన్య కానీ, నాగార్జున కానీ, వాళ్ళ తరుపున బంధువులు కానీ..ఒక్కరు ఈ ఇష్యూ పై రెస్పాండ్ అవ్వలేదు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత కి విడాకులు ఇవ్వమని చెప్పింది ఓ స్టార్ హీరోనేనట. ఆయన మరెవరోకాదు..బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న మల్టీ టాలెంటెడ్ నటుడు అమీర్ ఖాన్. యస్..ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కమల్ R ఖాన్ అలియాస్ KRK ట్వీట్స్ ప్రకారం..సమంత నాగచైతన్య విడాకుల మ్యాటర్ లో కీలక పాత్ర పోషించారట అమీర్ ఖాన్.

కమల్ R గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..ఎప్పుడు తన నోటి దూకుడుతో కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. గతంలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ను ఎన్ని మాటలు అన్నాడో మనకు తెలిసిందే. అంతేకాదు యష్ రాజ్ ఫిల్మ్స్‌ను దారుణంగా దూషించాడు. ఇటీవలి కాలంలో వివాదస్పద వ్యాఖ్యలతో చాలాసార్లు వార్తల్లో నిలిచాడు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్నాడు.

టాలీవుడ్ మాజీ జంట నాగ చైతన్య మరియు సమంతల విడాకులకు అమీర్ ఖాన్ కారణమని KRK ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. నాగ చైతన్య అమీర్ ఖాన్ రెచ్చ కొట్టాడట. “సమంత తో నీకు కుదరదు..నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది”..అంటూ అసలే గొడవలతో సతమతమవుతున్న జంట మధ్య మరిన్ని చిచ్చులు పెట్టి సక్సెస్ ఫుల్ గా విడతీసారట. KRK తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నాడు, “నాకు దగ్గర పూర్తి స్టోరి ఉంది. తన భార్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగ చైతన్యను ఎలా ఒప్పించాడు. అంటే ఆయన గుండె నిండుగా నల్లగా ఉన్నాడని అర్థం! ‘తో భాయ్ ఐసే ఆద్మీ కి ఫిల్మ్‌ తో నహీ చల్ శక్తి. నా సమీక్ష త్వరలో విడుదల అవుతుంది. ”అంటూ ట్వీట్ చేశాడు.అయితే, ఆయన మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news