Moviesచిరు గాడ్‌ఫాథ‌ర్ కంటే #NBK 107 ప్రి రిలీజ్ బిజినెస్ టాప్...

చిరు గాడ్‌ఫాథ‌ర్ కంటే #NBK 107 ప్రి రిలీజ్ బిజినెస్ టాప్ లేపుతోందిగా… తేడా ఎక్క‌డ కొడుతోంది..!

బాల‌య్య‌, చిరు ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీలో నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ హీరోలే. చిరు ప‌దేళ్ల త‌ర్వాత కంబ్యాక్ ఇచ్చారు. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో వ‌చ్చాడు. ఇది చిరు కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ సినిమా. అటు బాల‌య్య అదే సంక్రాంతికి త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో పోటీగా వ‌చ్చాడు. రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే బాల‌య్య శాత‌క‌ర్ణి కంటే చిరు ఖైదీ 150 సినిమాకే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి.

అయితే చిరుది రీమేక్ సినిమా. అప్ప‌టికే త‌మిళంలో హిట్ అయిన క‌త్తి సినిమాను ఇక్క‌డ రీమేక్ చేశారు. బాల‌య్య తెలుగోడి గౌర‌వం చాటిన శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీసి పెద్ద ప్ర‌యోగం చేసి హిట్ కొట్టాడు. అప్పుడు చిరు లాంగ్ గ్యాప్ త‌ర్వాత రావ‌డంతో మార్కెట్ ఎక్కువ‌గానే జ‌రిగింది. ఆ త‌ర్వాత బాల‌య్య కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో చిరు సైరా సినిమా వ‌చ్చి రు. 100 కోట్ల షేర్ రాబ‌ట్టినా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇక ఆచార్య అయితే రు. 50 కోట్ల షేర్ కూడా రాబ‌ట్ట‌లేదు.

ఇప్పుడు చిరు మార్కెట్‌ను, బాల‌య్య మార్కెట్‌ను కంపేరిజ‌న్ చేస్తే బాల‌య్య మార్కెట్ చాలా స్పీడ్ అయ్యింది. అఖండ అతి త‌క్కువ రేట్ల‌తో రిలీజ్ అయ్యి ఏకంగా రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా మ‌రో రు. 50 వ‌చ్చాయి. మొత్తం రు. 200 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఇప్పుడు బాల‌య్య చేతిలో రెండు మూడు సినిమాలు లైన్లో ఉంటే.. అటు చిరు కూడా నాలుగు సినిమాలు వ‌దులుతున్నాడు. అయితే ఎందుకోగాని బాల‌య్య సినిమాల ప‌ట్ల ఉన్న క్రేజ్‌, ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్న ఆస‌క్తి చిరు సినిమాల‌కు క‌న‌ప‌డ‌డం లేదు.

తాజాగా వ‌స్తోన్న చిరు గాడ్ ఫాథ‌ర్ విష‌యానికి వ‌స్తే ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మెగాస్టార్ రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా బిజినెస్ జ‌ర‌గ‌డం లేదంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అదే బాల‌య్య – మ‌లినేని సినిమాకు భారీ ఎత్తున అడ్వాన్స్‌ల‌పై బిజినెస్, చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. బాల‌య్య సినిమాకు ప్ల‌స్ అఖండతో బాల‌య్య రేంజ్‌, స్టామినా ఏంటో ఫ్రూవ్ అవ్వ‌డం.. అన్‌స్టాప‌బుల్‌తో బాల‌య్య క్రేజ్ ఈ త‌రంలో కూడా అమాంతం పెర‌గ‌డం… ఇటు హిట్ డైరెక్ట‌ర్‌, అటు మైత్రీ మూవీస్ బ్యాక‌ప్‌, శృతీహాస‌న్ హీరోయిన్‌గా ఉండ‌డం.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు హైప్ తీసుకురావ‌డం క‌లిసి వ‌స్తున్నాయి.

చిరు సినిమా విష‌యానికి వ‌స్తే ఇది ఆల్రెడీ మ‌ళ‌యాళంలో ఎప్పుడో వ‌చ్చిన సినిమా. ఇది క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా ఉంటుంది. అయితే ఇక్క‌డ బ‌ల‌వంతంగా క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఇరికిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ అంత పాజిటివ్ బ‌జ్ లేద‌నే అంటున్నారు. అంతెందుకు ఇటు రామ్‌చ‌ర‌ణ్ ఉండి.. కొర‌టాల లాంటి అప‌జ‌యం ఎరుగ‌ని డైరెక్ట‌ర్ తీసిన ఆచార్య‌కే ముందు ఎలాంటి బ‌జ్ లేదు. ఇక ఇప్పుడు చిరు వ‌రుస‌గా రీమేకులు లూసీఫ‌ర్ – గాడ్‌ఫాథ‌ర్‌, వేదాళం – భోళాశంక‌ర్ సినిమాల‌తో పాటు వాల్తేరు వీర‌య్య చేస్తున్నారు.

చిరు ఎంపిక చేసుకుంటోన్న డైరెక్ట‌ర్ల‌లో మోహ‌న‌రాజాపై తెలుగు వాళ్ల‌కు న‌మ్మ‌కాలే లేవు. ఇక మెహ‌ర్ ర‌మేష్ గురించి మెగా ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు. ఇటు బాబి టేకింగ్ విష‌యంలో చిరుయే అస‌హ‌నంతో ఉన్నార‌ని టాక్ ? త‌ర్వాత కూడా చిరు లైన‌ఫ్‌లో వివి. వినాయ‌క్ ఉంటే బాల‌య్య వెంట‌నే అనిల్ రావిపూడి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడు. ఏదేమైనా చిరు ఎంపిక చేసుకుంటోన్న క‌థ‌లు, డైరెక్ట‌ర్లే ఇప్పుడు ఆయ‌న సినిమాల బిజినెస్‌ను బాగా ప్ర‌భావితం చేస్తున్నాయి. అదే టైంలో బాల‌య్య త‌న పాజిటివ్ వైబ్స్‌ను బాగా వాడుకుంటూ క‌థాబ‌లంతో పాటు ఎంపిక చేసుకున్న డైరెక్ట‌ర్లు కూడా బాల‌య్య సినిమాల‌కు క్రేజ్ రావ‌డానికి కార‌ణంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news