Moviesమెగాడాట‌ర్ శ్రీజ విడాకుల‌పై ఆ నిర్మాత కామెంట్స్‌తో అంతా గంద‌ర‌గోళం..!

మెగాడాట‌ర్ శ్రీజ విడాకుల‌పై ఆ నిర్మాత కామెంట్స్‌తో అంతా గంద‌ర‌గోళం..!

మెగా డాటర్ శ్రీజ కొణిదల ఈమధ్య కాలంలో తరచు వార్తల్లో అయితే ఉంటున్నారు. యేడాది క్రింద‌ట ఆమె త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్ల నుంచి త‌న భ‌ర్త పేరు తీసివేయ‌డంతో స్టార్ట్ అయిన గంద‌ర‌గోళం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమె భ‌ర్త పేరు తొల‌గించిన‌ప్ప‌టి నుంచే ఆమె కూడా స‌మంత బాట‌లోనే విడాకులు తీసుకోబోతోందంటూ ఒక్క‌టే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

వీరి విడాకుల వార్త‌ల‌పై అటు శ్రీజ‌, ఇటు క‌ళ్యాణ్‌దేవ్ ఇద్ద‌రూ స్పందించ‌నే లేదు. అయితే మెగా ఫ్యామిలీ అయితే క‌ళ్యాణ్‌ను ప‌క్క‌న పెట్టేసింద‌నే అంటున్నారు. క‌ళ్యాణ్ చివ‌రి రెండు సినిమాల‌ను మెగా ఫ్యామిలీ ప‌ట్టించుకోక‌పోవ‌డం, అటు మెగా ఫంక్ష‌న్లు, కార్య‌క్ర‌మాల్లో క‌ళ్యాణ్‌దేవ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌య్యింది.

ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఉన్న టాక్ ప్ర‌కారం చూస్తే శ్రీజ ఇప్ప‌టికే క‌ళ్యాణ్‌కు విడాకులు ఇచ్చేసింద‌ని.. అయితే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు మాత్రం అధికారికంగా చెప్ప‌డం లేద‌నే అంటున్నారు. ఇక శ్రీజ త‌న స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధ‌మైంద‌ని కూడా అంటున్నారు. ఇక శ్రీజ విడాకుల‌పై ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా ఒక్కొక్క‌రు కామెంట్లు చేస్తున్నారు.

న‌టి పూజిత శ్రీజ విడాకులు, మూడో పెళ్లిపై కామెంట్ చేయ‌గా.. ఇప్పుడు సీనియ‌ర్ నిర్మాత త్రిపుర‌నేని చిట్టిబాబు చేసిన కామెంట్లు మ‌రింత గంద‌ర‌గోళానికి దారితీశాయి. అమ్మాయి లేదా అబ్బాయి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలియ‌జేయ‌డం పూర్తిగా త‌ప్పు అని.. శ్రీజ కూడా ఇలాంటి త‌ప్పు చేయ‌డంతోనే ఆమెపై లేనిపోని వార్త‌లు, అపోహ‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆమె త‌న భ‌ర్త పేరు తొల‌గించినంత‌మాత్రాన విడాకులు తీసుకుంద‌ని ఎలా ? ఫిక్స్ అవుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

శ్రీజ త‌న ఇష్ట ప్ర‌కార‌మే త‌న భ‌ర్త అనుమతితోనే భ‌ర్త పేరు తీసేసి త‌న ఇంటి పేరు మార్చుకుందేమో అన్న ఆయ‌న… సోష‌ల్ మీడియాలో ఎవ‌రెవ‌రో వాళ్ల‌పై వార్త‌లు రాస్తే వారంద‌రికి స‌మాధానం చెప్పే అవ‌స‌రం వాళ్ల‌కు ఉండ‌ద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఏదేమైనా వీళ్లిద్ద‌రు ఇప్ప‌టికే విడిపోయార‌ని చాలామంది అనుకుంటుంటే ఇప్పుడు చేసిన కామెంట్స్‌తో అస‌లు వీళ్లు విడిపోయారో ? క‌లిసున్నారో ? తెలియక మ‌రింత గంద‌ర‌గోళంలో ప‌డ్డారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news