Moviesఅప్పట్లో ఆర్తి అగర్వాల్... ఇప్పుడు కృతి శెట్టి... సేమ్ అదే రాంగ్...

అప్పట్లో ఆర్తి అగర్వాల్… ఇప్పుడు కృతి శెట్టి… సేమ్ అదే రాంగ్ రూట్లో వెళుతోందా…!

అప్పట్లో ఆర్తి అగర్వాల్..ఇప్పుడు కృతి శెట్టి ఈ విషయంలో తేడా ఏం లేదా..? అంటూ చాలామంది నెటిజన్స్ కంపేర్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో అమెరికా నుంచి నేరుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా అవకాశాలు అందుకుంది. కెరీర్ ప్రారంభం నుంచే ఆర్తి సీనియర్ హీరోలతో నటించడానికి ఒప్పుకుంది. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంది.

ఎన్.టి.ఆర్, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. అయితే, ఆర్తీ ఏజ్ కి తగ్గట్టుగా కొంతకాలం యంగ్ హీరోల సరసన గనక నటిస్తే కెరీర్ మరోలా ఉండేది. అలా కాకుండా సీనియర్ హీరోల సరసన కూడా నటించడం..కొన్ని కలిసి రాని కథలను ఎంచుకోవడం తను చేసిన పెద్ద పొరపాటు. ఇక కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడటం తను చేసిన పెద్ద మిస్టేక్. అదే ఆర్తి కెరీర్ కంప్లీట్‌గా దెబ్బతినడానికి కారణం అయింది. అప్పట్లో ఈ విషయం సంచలనం కూడా అయిన సంగతి తెలిసిందే.

అయితే, దాదాపు ఇదే పంథాలో సాగుతుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాకి ముందు అమ్మడు అవకాశాల కోసం బాగానే తిరిగిందని చెప్పుకుంటుంటారు. ఎట్టకేలకు ఉప్పెన సినిమాతో కృతి ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ ఒక్క సినిమా కృతి ఫేట్ మొత్తం ఊహించని విధంగా మారిపోయింది. మొదటి సినిమా షూటింగ్ పూర్తై ట్రైలర్ ..సాంగ్స్ రిలీజ్ కాగానే కృతికి వరుసగా అవకాశాలు వచ్చాయి.

మరీ ముఖ్యంగా మూడు హిట్స్ వరుసగా పడటం విశేషం. దాంతో ఇప్పుడు కృతికి సౌత్ మొత్తం బాగా క్రేజ్ పెరిగిపోయింది. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే, ఆర్తి అగర్వాల్ మాదిరిగా సీనియర్ హీరోల సరసన నటించడానికి తమిళం, తెలుగులో రాం సరసన ది వారియర్ సినిమా కంప్లీట్ చేసింది. మాచర్య నియోజిక వర్గం దాదాపు పూర్తైంది. ఇవి తన కెరీర్ కి ప్లస్ అయ్యేవే.

కానీ, తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించడమే కొందరిలో సందేహాలు కలుగుతున్నాయి. అందులోనూ బాలా డైరెక్షన్ అనగానే ఆ సినిమా ఎంత వైవిధ్యంగా ఉన్నా..హిట్ అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. దాంతో సూర్య సినిమా ఒప్పుకొని రాంగ్ స్టెప్ వేసిందని అంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే జనాలు ఆర్తి అగర్వాల్ తో కృతి శెట్టిని కంపేర్ చేయడంలో తప్పులేదు. మరి దీనిపై కృతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news