Moviesఆ ఇద్ద‌రు స్టార్ హీరోలంటే నాకు పిచ్చ క్ర‌ష్‌.. ప్రియాంక జ‌వాల్క‌ర్...

ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలంటే నాకు పిచ్చ క్ర‌ష్‌.. ప్రియాంక జ‌వాల్క‌ర్ మ‌న‌సు విప్పేసిందిగా…!

ప్రియాంక జ‌వాల్క‌ర్ అచ్చ తెలుగు అనంత‌పురం అమ్మాయి. ట్యాక్సీవాలా సినిమాతో ఒక్క‌సారిగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. కావాల్సినంత అందంతో పాటు అభిన‌యం ఉండ‌డంతో ప్రియాంక‌కు కావాల్సిన‌న్ని అవ‌కాశాలు వ‌చ్చినా ఎందుకో గాని స్టార్ హీరోయిన్ రేంజ్‌కు అయితే వెళ్లలేదు. ట్యాక్సీవాలా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో అల్లు అర్జున్ అంటే త‌న‌కు పిచ్చ క్ర‌ష్ అని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి అమ్మ‌డు ఏకంగా బ‌న్నీ ఎట్రాక్ష‌న్ త‌న వైపున‌కు తిప్పుకునేందుకు ఈ గేమ్ ఆడింద‌న్న చర్చ‌లు న‌డిచాయి.

అయితే బ‌న్నీ ఆమెకు ఇప్ప‌టి వ‌ర‌కు అయితే అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఆమె ఏకంగా కోలీవుడ్ హీరోల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కోలీవుడ్ హీరోలు అయిన ధనుష్, శింబు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ కలిగి ఉన్నారు. ఈ త‌మిళ హీరోల‌పై త‌న‌కు విప‌రీత‌మైన క్ర‌ష్ ఉంద‌ని ప్రియాంక తాజాగా కామెంట్లు చేసింది.

 

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చేసిన లైవ్ చాటింగ్‌లో ప్రియాంక ఈ విష‌యంపై ఓపెన్ అయిపోయింది. ఓ అభిమాని మీ కోలీవుడ్ క్ర‌ష్ ఎవ‌రు ? అని ప్ర‌శ్నించ‌గా.. ఆమె ఈ ఆన్స‌ర్ ఇచ్చింది. తాను ఎప్ప‌టి నుండో ధ‌నుష్ ప‌ట్ల ఇష్టంతో ఉన్నాన‌ని.. ఇక కొన్ని కార‌ణాల వ‌ల్ల శింబు అన్నా కూడా ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు ప్రియాంక చెప్పింది. ఈ ఇద్ద‌రు హీరోలు కూడా క్యూట్ పీప్స్ అని చెప్పింది.

ఏదేమైనా ప్రియాంక తెలుగులో బ‌న్నీని, అటు త‌మిళంలో ధ‌నుష్‌, శింబు లాంటి కుర్ర హీరోల ప‌క్క‌న ఛాన్సుల కోసం వీళ్ల‌కు బాగానే వ‌ల వేస్తుంద‌న్న చ‌ర్చ‌లు నెటిజ‌న్ల‌లో న‌డుస్తున్నాయి. కొంద‌రు ఫ్యాన్స్ అయితే త్వ‌ర‌లోనే మీరు కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాల‌ని కోరారు. ఏదేమైనా ఈ తెలుగు అందానికి టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి ఛాన్సులు వ‌చ్చి టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news