Moviesసమంత అబద్ధాలు చెబుతుందా...? బన్ని మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!!

సమంత అబద్ధాలు చెబుతుందా…? బన్ని మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాఫీ విత్ కరణ్ షోలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన విడాకులు ఏం సామరస్యంగా జరగలేదు అని చెప్పిన ఆవిడ..మా ఇద్దరిని ఒక్కే గదిలో పెడితే..ఆయుధాలు కూడా పెట్టాలి అని పరోక్షంగా నాగ చైతన్య పై విరుచుపడ్డింది. ఇండస్ట్రీలో నెపొటిజం గురించి మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఐటేం సాంగ్ గా చేసిన ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ..అనే సాంగ్ ఎందుకు చేసానో చెప్పి మైండ్ బ్లాక్ చేసింది.

“ఆ పాటలో ఉన్నది పచ్చి నిజం. కొందరు మగాళ్లు అలానే బీహేవ్ చేస్తారు. మేం మగ్గాళము అంటూ పొగరుగా ఉంటారు..అలాంటి వాళ్లకోసమే ఈ పాట చేశా.. వేరే ఎవ్వరైన చెప్పితే..ఆ పాట లోని లిరిక్స్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ, నేను చెప్పితే అంతో ఇంతో జనాలు ఆలోచిస్తారు..అన్న రీతిలో చెప్పుకొచ్చింది. అందుకే ఆ పాట చేసే అవకాశం వచ్చినప్పుడు…ఆలోచించకుండా ఓకే చేశా”..అంటూ కరణ్ తో చెప్పింది.

అయితే, గతంలో పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో ..అల్లు అర్జున్ మాట్లాడుతూ..”సమంత చాలా టాలెంటెడ్ ఉన్న అమ్మాయి. తాను ఏం చేసినా పర్ ఫెక్ట్ గా నే ఉంటుంది. బాగా ఆలోచించే చేస్తుంది. మేము ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయమని అడగడానికి వెళ్ళినప్పుడు..సమంత మొదట ఒప్పుకోలేదు. కానీ , ఆ తరువాత త అన్ని చెప్పి ఒప్పించాం.. అప్పటికి ఫైనల్ గా ఓకే అన్నింది..ఈ సినిమా విజయానికి ఆమె పాట్ కూడా కారణం”..అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి మాటలు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. దీంతో సమంత అబద్ధాలు చెబుతుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పాట విషయంలోనే అబద్ధం చెప్పిన సమంత..చైతన్య విషయంలో నిజం చెప్పుతుందని గ్యారింటి ఉందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news