Moviesతన 17 ఏళ్ల సినీ కెరీర్ లో అనుష్క ఇష్టం లేకుండా...

తన 17 ఏళ్ల సినీ కెరీర్ లో అనుష్క ఇష్టం లేకుండా చేసిన సినిమా ఇదే..రిజల్ట్ చూసి బాధపడిందట!!

అనుష్క శెట్టి..ఈ పేరు కి ఇండస్ట్రీలో కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు చేస్తున్న..చేయకపోయినా..ఆ రేంజ్ అలానే మెయిన్ టైన్ చేస్తూ వస్తుంది. ఇలాంటి అభిమానాని అందుకోవడం చాలా రేర్ ..కానీ, అనుష్క హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటుంది. అనుష్క లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే..తాను సినిమాలో పాత్ర కోసం ఎలాంటి డ్రెస్ వేసినా..బయట మాత్రం చాలా పద్ధతిగా డ్రెస్లు వేసుకుంటూ వస్తుంది.

ఏ ఇంటర్వ్యు కి వెళ్ళాలి అన్నా కానీ, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నా సరే..చాలా చక్కగా చీర కట్టుకోవడం..లేదా..చుడిదార్ వేసుకుని వస్తుంది అంతే. అందుకే స్వీటీ అంటే ఇండస్ట్రీలో అదో రకమైన ఇది. సినిమాలు చేయకపోయినా..ఆమె ను స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంచారు. మనకు తెలిసిందే నిశ్శబ్దం సినిమా తరువాత..స్వీటి ఏ సినిమా చేయలేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి తో మాత్రమే ఓ సినిమాకి కమిట్ అయ్యింది. మిగతా సినిమాలు ఏవి లేవు.

 

రీసెంట్ గా తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె..17 ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పూర్తి చేసుకుంది. అంతేనా..కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ, తన ఇన్నేళ్ల కెరీర్ లో అనుష్క స్క్రిప్ట్ విని నచ్చకపోయినా చేసిన సినిమా మాత్రం..”బిల్లా”నే అట.

ఆ సినిమా స్టోరీ అనుష్క కు చెప్పినప్పుడు..ఆమె కు నచ్చలేదట, కానీ, ప్రభాస్ రిక్వెస్ట్ చేయడంతో ఓకే చేసిందట. కానీ రిజల్ట్ చూసి మాత్రం బాధపడిందట. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అనుష్క ప్రభాస్ జంట కు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇప్పటికి టీవి లో ఈ సినిమా వస్తే..ఖచ్చితంగా మిస్ కాకుండా సినిమా చూసే వాళ్లు బోలెడు మంది ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news