Moviesఅల్లు అర్జున్ క్లిక్ అవ్వడానికి..శిరీష్ కెరీర్ దొబ్బేయడానికి రీజన్ ఇదే..?

అల్లు అర్జున్ క్లిక్ అవ్వడానికి..శిరీష్ కెరీర్ దొబ్బేయడానికి రీజన్ ఇదే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు వచ్చారు. కానీ అదృష్టం కొంత మందినే వరించింది. మరికొంతమంది అడ్రెస్ లేకుండా పోయారు అలాంటి వారిలో ఈ అల్లు శిరీష్ కూడా ఒకరు . అల్లు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో కి హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు..హిట్ అన్న మాటకి దూరం ఉన్నాడు. వచ్చింది తక్కువ ఆఫర్స్.. చేసింది ఇంకా తక్కువ..అందులో హిట్స్ అసలే కే లేవు..యావరేజ్ అంటే మాట్రం “శ్రీరస్తు శుభమస్తు”.

ఈ సినిమాలో కూడా అల్లు శిరీష్ ..నటన అంతంత మాత్రం గానే ఉంది. లావణ్య అందాలు ఈ సినిమా సక్సెస్ కి కొంచెం ప్లస్ అయ్యాయి అంటుంటారు జనాలు. అలా ..పేరుకి పెద్ద ఇంటి నుండి వచ్చినా..అన్న బడా హీరో..మరో అన్న స్టార్ నిర్మాత అయిన..తండ్రికి పెద్ద ప్రోడక్షన్ హౌస్ ఉన్నా..కానీ, ఈ హీరో ఆ పాపులారిటిని వాడుకోలేకపోయాదు. అప్పతికి అల్లు అరవింద్..శిరీష్ భవిష్యత్తు కోసం..చాలా ప్లాన్స్ ట్రై చేశారట. కానీ..ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు.

ఎందుకో తెలియదు కానీ ఈయన సినిమాలని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో సంవత్సరం కిందట . ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి వహించారు.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. అయితే, ఈ సినిమా ఉందో ఆగిపోయిందో..అస్సలు రిలీజ్ అవుతుందా లేదా అనే దాని పై ఒక్క అప్ డేట్ లేదు. నిజానికి బన్నీ కి చాలా ఓపిక ఎక్కువట..డైరెక్టర్లతో ఎలా తనకు కావాల్సిన కధ రావాలో రాబట్టుకునే టైప్..కానీ, శిరీష్..రఫ్ అంటూ ఓ టాక్ ఉంది. మొండి గా ఉంటాడని..మర్యాద తెలియదని..ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో పక్క బన్నీ బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా కధలు చరచిస్తున్నాడు. కానీ ఆయన తమ్ముడు మాట్రం ఇలా ఎటు కాకుండా సింగిల్ గా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news