Moviesఆ తెలుగు హీరోతో సాయి ప‌ల్ల‌వి పెళ్లి ... ఆమె మాట‌ల...

ఆ తెలుగు హీరోతో సాయి ప‌ల్ల‌వి పెళ్లి … ఆమె మాట‌ల వెన‌క అర్థం అదే…!

ఈ జ‌న‌రేషన్లో ఉన్న బెస్ట్ హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. ఎంత పెద్ద టాలెంట్ ఉన్న హీరోలు, నటుల‌తో అయినా పోటీ ప‌డి మ‌రీ ఆమె న‌టిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కొంద‌రు హీరోలు అయితే ఆమె త‌మ సినిమాలో ఉందంటేనే త‌మ‌ను ఎక్క‌డ డామినేట్ చేస్తుందో ? అన్న భ‌యంతో ఉంటార‌న్న‌ది వాస్త‌వం. ఒక్కోసారి ఆమె డామినేష‌న్ బిహేవియ‌ర్‌తో టాలీవుడ్లో కొంద‌రు కుర్ర హీరోల అహాన్ని కూడా ట‌చ్ చేసింద‌న్న ప్ర‌చార‌మూ ఉంది.

ఇక గ‌త కొంత కాలంగా సాయిప‌ల్ల‌వి పెళ్లి అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌రోనా లాక్‌డౌన్ టైంలో ఎంతో మంది కుర్ర హీరోలు, కుర్ర హీరోయిన్లు, కాజ‌ల్ లాంటి ముదురు హీరోయిన్లు పెళ్లిల్లు చేసుకున్నారు. అప్పుడే సాయిప‌ల్ల‌వి పెళ్లి అన్న రూమ‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లి గురించి చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలే చెప్పింది.

లాక్‌డౌన్ టైంలో పెళ్లి చేసుకోమ‌ని అమ్మ‌, నాన్న చాలా ఒత్తిడి చేశారు. లాక్‌డౌన్ టైంలో ఎవ‌రు ఎప్పుడు ఉంటారో తెలియ‌క‌పోవ‌డంతో వారు చాలా భ‌య‌ప‌డ్డారు. చివ‌ర‌కు త‌నకు పెళ్లి చేసేయాల‌ని వారు డిసైడ్ అయ్యారు.. వాళ్లుతెచ్చిన సంబంధం ఫొటో కూడా తాను చూడ‌లేద‌ని ఆమె చెప్పింది. అయితే తాను మాత్రం ఇంకా పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పి త‌ప్పించుకున్నాన‌ని కూడా ఆమె తెలిపింది.

ఇక త‌న కులంలో అబ్బాయి దొర‌క‌డం కూడా క‌ష్ట‌మైపోతోంద‌ని చెప్పిన ఆమె తాను తెలుగింటి కోడ‌లు అవుతానా ? లేదా ? అన్న‌ది నా చేతుల్లో లేద‌ని చెప్ప‌డం ద్వారా కొత్త సందేహాల‌కు తావిచ్చింది. ఈ మాటే ఇప్పుడు చాలా చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. సాయిప‌ల్ల‌వి ఓ తెలుగు కుర్ర హీరోతో ప్రేమ‌లో ఉంద‌న్న వార్త‌లు గ‌త కొంత కాలంగా వినిపిస్తున్నాయి. వారిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని.. వారు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌న్న ప్ర‌చారం కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు ఆమెనోట తెలుగింటి కోడ‌లు అన్న మాట రావ‌డంతో వీరి మ‌ధ్య ఉన్న బంధంపై మ‌రింత బ‌లంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. స‌ద‌రు హీరో ఇప్పుడు సింగిల్‌గానే ఉన్నాడు. ఆ హీరోయిన్‌పై మ‌న‌సు పడ‌డంతో పాటు ఆమె ప‌ట్ల ఎంతో ఇష్టంతో ఉన్నాడ‌ని కూడా అంటున్నారు. మ‌రి ఆమె వైపు నుంచి కూడా సానుకూల‌త ఉంద‌నే అంటున్నారు. మ‌రి వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే కొత్త జీవితం ప్రారంభిస్తారేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news