Moviesఆ డైరెక్ట‌ర్ - ఎన్టీఆర్ సినిమా కోసం కళ్ళు కాయలు కాస్తున్నాయి..బీపీలొస్తున్నాయ్‌..!

ఆ డైరెక్ట‌ర్ – ఎన్టీఆర్ సినిమా కోసం కళ్ళు కాయలు కాస్తున్నాయి..బీపీలొస్తున్నాయ్‌..!

గత రెండు మూడేళ్ళుగా ఓ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ కాంబినేషనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. మన టాలీవుడ్‌లో 50 కోట్ల బడ్జెట్ పెట్టి తీసే సినిమాలతో వారు రెండు మూడు సినిమాలు తీస్తారు. అంటే అక్కడ సినిమా బడ్జెట్ ఎంత తక్కువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్నీ సౌత్ సినిమా ఇండస్ట్రీలకంటే కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది.

అలాంటి చిన్న సినిమా ఇండస్ట్రీలో ఉగ్రం అనే యాక్షన్ సినిమాను తీసి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే, ఈ సినిమా తర్వాత కూడా మిగతా సౌత్ భాషలలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. అయితే, 2019లో యష్‌ను హీరోగా పెట్టి ఆయన తీసిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో సౌత్ మొత్తం కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. పాన్ ఇండియన్ రేంజ్ సినిమా తీసే దర్శకుడంటే అప్పటివరకు ఒక్క రాజమౌళీ గురించే గొప్పగా చెప్పుకునేవారు.

కానీ, ఎప్పుడైతే కేజీఎఫ్ 1 వచ్చి యాక్షన్ సినిమాగా విపరీతమైన వసూళ్ళు రాబట్టి అందరి దృష్ఠిని తనవైపు తిప్పుకున్నారో అప్పటి నుంచి రాజమౌళికి దాదాపు సమానంగా పేరు సాధించారు. అంతేకాదు, కేజీఎఫ్ 1 చూసిన తర్వాత మన టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేసేయ్యాలని గట్టిగా ఫిక్సైయ్యారు. ప్రశాంత్ నీల్ కూడా తన టార్గెట్ టాలీవుడ్ హీరోలు – నిర్మాతలే అన్నట్టుగా మన స్టార్స్ కోసం భారీ యాక్షన్ సినిమా తీయాలని కథలు రెడీ చేసుకున్నారు. అలా ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తీస్తున్నారు.

అయితే, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో ప్రశాంత్ నీల్ తారక్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఇటు తారక్ అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే కాకుండా గత ఏడాది నిర్మాతలు కన్‌ఫర్మ్ చేశారు. ఇటీవల అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ ఇందులో ఎన్.టి.ఆర్ వైల్డ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఒక్క పోస్టర్‌తో అంచనాలు అమాంతం పెచేశారు ప్రశాంత్ నీల్.

ఆయనకు బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్ బాగా ఇష్టమేమో..తారక్‌తో చేయబోతున్న ఎన్.టి.ఆర్ 31 కూడా ఇదే నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. జస్ట్ పోస్టర్‌తోనే ఇది ఏ రేంజ్ సినిమానో ఎలాంటి యాక్షన్ సినిమానో..ఎంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతుందో క్లారిటీ వచ్చేసింది. అందుకే, ఈ సినిమా కోసం అభిమానుల కళ్ళు కాయలు కాస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news