Moviesఈ పాప నిశ్చితార్థం అయిపోయిందోచ్..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ఈ పాప నిశ్చితార్థం అయిపోయిందోచ్..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రజెంట్..సినిమా ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఈ మధ్యనే కత్రినా-విక్కి, అలియా-రనబీర్, ఆది-నిక్కి, ఇలా అందరు హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో సెలబ్రిటీ మూడు ముళ్లు వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. ఆమె మరెవరో కాదు.. సుహాని కలిత. ఈ పేరు చెప్పితే గుర్తు పట్టడం కష్టం.

కానీ, హీరో ఉదయ్ కిరణ్ మూవీలో చిన్నప్పటి హీరోయిన్ గా చేసిందే..అదే “‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుంది కదా,…హా, ఆ చిన్న పాపే..ఇప్పుడు పెద్దదైంది. పెళ్లి కూడా చేసుకోబోతుంది. సుహాని కలిత. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలో నతించి మెప్పించింది. గణేష్‌, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అలరించింది. అంతేనా..పెద్ద అయ్యాక హీరోయిన్ గా కూడా ట్రై చేసింది..కానీ ఆమె నటించిన సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక అదే సమయంలో తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వచ్చిన అవకాశాలతో నెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు కంపెనీల యాడ్స్‌లోనూ కనిపించి మెప్పించింది.

కాగా, తాజా గా అమ్మడు నిశ్చితార్ధం చేసుకుంది. సుహాని వివాహం చేసుకోబోయే వరుడి పేరు విభర్ హసీజా. ఈయన ఓ బిగ్ షాట్. మంచి సౌండ్ పార్టి అని టాక్. బాగా డబ్బున వారట. విభర్ మమ్యూజిక్ ఆర్టిస్ట్ గా, మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందారు. విభర్, సుహాని నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. నిశ్చితార్థం కోసం కలిత అందమైన లెహంగాలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మొత్తానికి పాప మంచి ఇంటికే కోడలుగా వెళ్తుందనమాట. దీంతో అమ్మడుకి సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పలువురు సెలబ్రిటీలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news