Moviesపాపం మెగా అల్లుడు ' క‌ళ్యాణ్‌దేవ్‌ ' కు ఎంత క‌ష్టం......

పాపం మెగా అల్లుడు ‘ క‌ళ్యాణ్‌దేవ్‌ ‘ కు ఎంత క‌ష్టం… !

మెగాస్టార్ ఫ్యామిలీలో అల్లుడు అయిన క‌ళ్యాణ్‌దేవ్‌కు ఒక‌ప్పుడు మెగా హీరోలతో పాటు మెగాభిమానులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. క‌ళ్యాణ్ ఎప్పుడు అయితే శ్రీజ‌కు భ‌ర్త‌గా.. మెగాస్టార్ చిరంజీవికి అల్లుడిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడో స్టార్ నిర్మాత‌లు కూడా అత‌డితో సినిమాలు చేసేందుకు క్యూలో నిల‌బ‌డ్డారు. అసుల ఊహించ‌ని విధంగా క‌ళ్యాణ్ హీరో అయ్యి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటు మీడియం రేంజ్ ద‌ర్శ‌కులు సైతం క‌ళ్యాణ్‌దేవ్ డేట్లు ఇస్తే చాల‌నుకున్నారు. రెండేళ్ల పాటు క‌ళ్యాణ్‌దేవ్ సినిమాల హ‌డావిడి.. ఆ వార్త‌లు కూడా బాగానే న‌డిచాయి.

క‌ళ్యాణ్‌దేవ్ తొలి సినిమా టైటిల్ కూడా మామ మెగాస్టార్ చిరంజీవి ఒక‌ప్ప‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజేత‌. విజేత టైటిల్‌తో డెబ్యూ మూవీతో ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్‌కు మెగా హీరోలు అంద‌రూ స‌పోర్ట్ చేశారు. చిరంజీవితో పాటు ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా విజేత హిట్ అవ్వాల‌ని.. క‌ళ్యాణ్ హీరోగా రాణించాల‌ని శుభాకాంక్ష‌లు చెప్పారు. చిరు అభిమానులు ప్ర‌ధాన న‌గ‌రాల్లో విజేత‌కు బాగానే హ‌డావిడి చేశారు.

విజేత రిజల్ట్ ఎలా ఉన్నా మినిమం ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుంది. అది కూడా మెగాభిమానుల పుణ్య‌మే. ఆ సినిమా ఓటీటీ బిజినెస్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు, మూడు సినిమాలు క‌ళ్యాణ్ లైన్లో పెట్టాడు. అయితే క‌రోనా క‌ష్ట‌కాలంలో ఏం జ‌రిగిందో కాని.. క‌ళ్యాణ్ – శ్రీజ మ‌ధ్య విబేధాలు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా వీరిద్ద‌రు దూరంగానే ఉంటున్నారు. మెగా కాంపౌండ్‌లో క‌ళ్యాణ్ క‌న‌ప‌డ‌డం మానేసి యేడాది దాటిపోయింది.

ఈ టైంలో మొన్న సంక్రాంతికి క‌ళ్యాణ్‌దేవ్ రెండో సినిమా సూప‌ర్‌మ‌చ్చి వ‌చ్చింది. ఈ సినిమా ఎంత అనాథ‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిందంటే అస్స‌లు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అసలు మెగా ఫ్యామిలీ అయితే క‌ళ్యాణ్ ఎవ‌రో త‌మకు తెలియదు అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా విష్ చేయ‌లేదు. మెగాభిమానులు వ‌దిలేశారు. సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అస్స‌లు మార్నింగ్ షోలే క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి.

మ‌రోవైపు శ్రీజ కూడా త‌న దారేదో తాను చూసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే క‌ళ్యాణ్ న‌టించిన తాజా సినిమా కిన్నెర‌సాని. నాగ‌శౌర్య అశ్వ‌థ్థామ ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన పెద్ద పారిశ్రామిక వేత్త తాళ్లూరి రామ్ ఈ సినిమా నిర్మాత‌. ఐదు నెల‌ల క్రిత‌మే ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే బ‌య్య‌ర్లు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేదు.

దీంతో నిర్మాత‌ల‌కు సీన్ అర్థ‌మైపోయింది. ఇప్పుడు ఓటీటీకి ఇచ్చేశారు. కిన్నెర‌సాని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని… జీ5 లో జూన్ 10న విడుద‌ల‌వుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో షీతల్, కషిష్ ఖాన్ హీరోయిన్లుగా నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఏదేమైనా మెగా అల్లుడు జాత‌కం జ‌స్ట్ యేడాదిలోనే తిర‌గ‌బ‌డి పోయింది. తాజా ప‌రిణామాల‌తో క‌ళ్యాణ్ సినిమాల‌కు కూడా పూర్తిగా దూర‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news