Moviesటాలీవుడ్‌లో ఎన్టీఆర్ - స‌మంత‌లే టాప్‌...స్టార్ హీరోల ర్యాంకులు ఇవే..!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ – స‌మంత‌లే టాప్‌…స్టార్ హీరోల ర్యాంకులు ఇవే..!

టాలీవుడ్ లో తిరుగులేని నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు స్టార్ యంగ్ హీరోల పేర్లు చాలానే వినిపిస్తాయి. ఈ రేసులో మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ప్ర‌ధానంగా పోటీ ప‌డుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు కొంద‌రు హీరోలు ఉన్నా.. మెయిన్ రేసులో పైన చెప్పుకున్న న‌లుగురు హీరోల పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తూ ఉంటాయి. మ‌ళ్లీ ఈ న‌లుగురిలో మ‌హేష్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్ మ‌ధ్య ఇంకాస్త గ‌ట్టిగా ట్ర‌యాంగిల్ ఫైట్ న‌డుస్తూ ఉంటుంది.

అయితే టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్లు ఎవ‌రు ? అని తాజాగా జ‌రిగిన స‌ర్వేలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ? మోస్ట్ పాపుల‌ర్ న‌టులు ? అన్న అంశంపై ప్ర‌తి యేటా స‌ర్వే నిర్వ‌హిస్తూ ఉంటుంది. ఇందులో ఈ యేడాది టాప్ 10 జాబితాను ట్విట్ట‌ర్ అక్కౌంట్ ద్వారా అధికారికంగా ఎనౌన్స్ చేసింది.

ఈ స‌ర్వేలో టాలీవుడ్ వ‌ర‌కు ఎన్టీఆర్ ఫ‌స్ట్ ప్లేస్ కైవ‌సం చేసుకున్నాడు. రెండో స్థానం యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ద‌క్కించుకున్నాడు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ ఉన్నారు. ఇక మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, చిరంజీవి, ర‌వితేజ ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు.
హీరోయిన్ల లిస్టులో స‌మంత ఫ‌స్ట్ ప్లేసులో.. కాజ‌ల్ రెండు, అనుష్క‌, పూజా హెగ్డే, ర‌ష్మిక ఆ త‌ర్వాత స్థానాల్లో నిలిచారు.

స‌మంత కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్నా కూడా కెరీర్ పై పూర్తిగా కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌స్తోంది. చైతుతో విడాకుల త‌ర్వాత కూడా ఆమె క్రేజ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆ క్రేజే ఆమెను టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌బెట్టింద‌ని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత నాలుగేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని ఎట్ట‌కేల‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌క్సెస్ అయ్యాడు.

త్రిబుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చేలా చేసింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు వ‌రుస‌గా ఆరు హిట్లు ప‌డ‌డంతో కూడా ఎన్టీఆర్ త‌న పాపులారిటీ అమాంతం పెంచేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news