Moviesటాలీవుడ్‌లో ' మెగా మ్యాజిక్ ' ఎందుకు మిస్ అవుతోంది...!

టాలీవుడ్‌లో ‘ మెగా మ్యాజిక్ ‘ ఎందుకు మిస్ అవుతోంది…!

తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్ మార్కెట్ ఓ కామ‌ధేనువు మాదిరిగా మారింది. గ‌త ఐదారేళ్లుగా తెలుగు సినిమాల‌కు అమెరికాలో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటోంది. కొంద‌రు స్టార్ హీరోల సినిమాలు అక్క‌డ కేవ‌లం ప్రీమియ‌ర్ షోల‌తోనే మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పాజిటివ్ టాక్ వ‌స్తే కేవలం ఒక్క రోజులోనే మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు సులువుగా వ‌స్తున్నాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాలు సైతం మిలియ‌న్ల వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి.

 

నేచుర‌ల్ స్టార్ నాని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాయే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమాలు కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌డ‌తాయి. డిజాస్ట‌ర్ సినిమాలు స్పైడ‌ర్‌, బ్ర‌హ్మోత్స‌వం కూడా అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టాయి. అయితే ఓవ‌ర్సీస్‌లో మెగా హీరోల సినిమాల‌కు మాత్రం ఆ రేంజ్ లో వ‌సూళ్లు రావ‌డం లేదు.

తాజాగా ఆచార్య పెద్ద బ‌జ్‌తో వ‌చ్చింది. చిరుతో పాటు చెర్రీ కూడా ఉన్నాడు. పైగా కొర‌టాల శివ డైరెక్ట‌ర్‌. అక్క‌డ ఈ సినిమాకు వ‌న్ మిలియ‌న్ మార్క్ క‌ష్టం కాద‌నుకున్నారు. అయితే ఆచార్య అక్క‌డ వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్‌లో చేర‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ సైతం వ‌న్ మిలియ‌న్‌కు రాలేదు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా రీమేక్ కావ‌డంతో మిలియ‌న్ క్ల‌బ్‌లో చేర‌లేదు.

ఇక మెగాప‌వ‌ర్ స్టార్ విన‌య విధేయ రామ కూడా క‌నీసం హాఫ్ మిలియ‌న్ వ‌సూళ్లు కూడా రాబ‌ట్టలేదు. పోనీ బ‌న్నీ స‌రైనోడు సినిమా కూడా హిట్ అయినా మిలియ‌న్ డాల‌ర్లు ద‌క్కించుకోలేదు. బ‌న్నీ ఓవ‌ర్సీస్ మార్కెట్ మిగిలిన మెగా హీరోల‌తో పోలిస్తే బాగున్నా కూడా కొన్ని సినిమాలు మిలియ‌న్ కు చేరుకోవ‌డం లేదు.

ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే కంటెంట్‌తో సినిమాలు చేయ‌క‌పోవ‌డం.. పైగా ఓ భాష‌లో అప్ప‌టికే హిట్ అయిపోయి… యూట్యూబుల్లో అంద‌రూ చూసేసిన సినిమాలు చేయ‌డం.. లేదా డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయ‌డ‌మే అని తెలుస్తోంది. మ‌రి మెగా హీరోలు ఈ విష‌యంలో మార‌క‌పోతే ఓవ‌ర్సీస్ లో వాళ్లు ఎప్పుడు వీక్‌గానే ఉంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news