Moviesడైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిపై అఖిల్ గుర్రు... ఏజెంట్ ఎక్క‌డ‌ తేడా కొట్టింది...!

డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిపై అఖిల్ గుర్రు… ఏజెంట్ ఎక్క‌డ‌ తేడా కొట్టింది…!

పాపం అక్కినేని వంశంలో మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. అక్కినేని ఫ్యామిలీ బ‌ల‌మైన లెగ‌సీ ఉన్నా… నాగార్జున ప్ర‌తి సినిమాకు పూర్తి స‌హ‌కారం అందిస్తున్నా కూడా అఖిల్ కెరీర్ స‌జావుగా సాగ‌డం లేదు. తొలి సినిమా అఖిల్‌కు ఎంత హైప్ ఇచ్చారో చూశాం. వినాయ‌క్ డైరెక్ట‌ర్‌.. రు. 55 కోట్ల బిజినెస్‌.. తీరా చూస్తే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే సినిమా ఢ‌మాల్ అంది. నిజంగా అఖిల్ కెరీర్‌లో అది ఘోర అవ‌మానంగా మిగిలిపోయింది.

రెండో సినిమా సొంత బ్యాన‌ర్లో మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌తో తీశారు. హ‌లో కూడా ప్లాప్ అయ్యింది. బాగుంద‌ని కొంద‌రు అన్నా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌సూళ్లు రాలేదు. మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను కూడా క‌లిసి రాలేదు. అది కూడా ప్లాపే అయ్యింది. చివ‌ర‌కు నాలుగో సినిమా కోసం బ‌న్నీ వాస్‌, అల్లు అర‌వింద్‌, అటు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ .. ఇటు నాగార్జున క‌లిసి … చివ‌ర‌కు పూజా హెగ్డేను హీరోయిన్‌గా పెట్టుకుని ఎంతో క‌ష్ట‌పడితే బ్యాచిల‌ర్ రూపంలో ఓ హిట్ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఏజెండ్ చేస్తున్నాడు. ఇది భారీ ప్రాజెక్టు… సైరా త‌ర్వాత సురేంద‌ర్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అయోమ‌యంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. ముందు ఈ సినిమా క్వాలిటీగా రావాల‌ని హీరో అఖిల్ త‌న రెమ్యున‌రేష‌న్ వ‌దులుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌కు రెమ్యున‌రేష‌న్ ముఖ్యం కాద‌ని.. సినిమా క్వాలిటీగా రావ‌డ‌మే ముఖ్యం అని చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయినా సురేంద‌ర్ రెడ్డి స‌రైన ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతో బ‌డ్జెట్ రు. 70 కోట్లు దాటిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటాన‌ని.. త‌న బ్యాన‌ర్ పేరు కూడా సినిమాకు యాడ్ చేయాల‌ని చెప్పిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. ఇప్పుడు తన‌కు వాటా వ‌ద్ద‌ని… త‌న‌కు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేయ‌మని అడుగుతున్న‌ట్టు భోగ‌ట్టా ?

సురేంద‌ర్ రెడ్డి రెమ్యున‌రేష‌న్ తీసుకుని సేఫ్ అయిపోవాల‌ని చూస్తున్నాడంటే… సినిమా రిజ‌ల్ట్‌పై ఆయ‌న‌కే ఏదో తేడా కొడుతుందా ? అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ముందుగా తీసిన సీన్లు కాకుండా… కొన్ని రీ షూట్లు చేయడం… కోవిడ్ వ‌డ్డీలు అన్ని క‌లిపి బ‌డ్జెట్‌ను అనుకున్న దానికంటే బాగా ఎక్కువుగా పెంచేశాయ‌ట‌.

వీటికి తోడు ప్రొడ‌క్ష‌న్ టీంకు, ఇటు హీరో అఖిల్‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌కు మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్ కూడా పెరిగిన‌ట్టు గ‌ట్టిగా వినిపిస్తోంది. అఖిల్ సైతం సురేంద‌ర్‌పై అస‌హ‌నంతోనే ఉన్నాడ‌ని అంటున్నారు. దీంతో ఆగ‌స్టు 12న వ‌స్తుంద‌నుకున్న ఏజెంట్ ఎప్ప‌ట‌కి వ‌స్తుందో ? ఈ సినిమాను ఎవ‌రు కాపాడ‌తారో ? తెలియ‌ని ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news