Moviesకొర‌టాల సినిమా కోసం ఎన్టీఆర్ కొత్తలుక్‌... ఇంత క‌ష్ట‌ప‌డుతున్నాడా...!

కొర‌టాల సినిమా కోసం ఎన్టీఆర్ కొత్తలుక్‌… ఇంత క‌ష్ట‌ప‌డుతున్నాడా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వ‌స్తోన్న భారీ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీని హీరోయిన్‌గా కొర‌టాల & టీం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తుండ‌డంతో ఎవ్వ‌రూ కూడా ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఎన్టీఆర్‌కు తాజాగా త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. ఈ ఇమేజ్‌ను కంటిన్యూ చేసే క్ర‌మంలోనే కొర‌టాల క‌థ‌ఫై చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. పైగా కొరటాల‌కు తాజాగా ఆచార్య‌తో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సినిమాను హిట్ చేయ‌క‌పోతే కొర‌టాల పాతాళానికి ప‌డిపోతాడు.

అందుకే ఇప్పుడు క‌థ‌పై కూర్చొని మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సినిమా లుక్‌కు సంబంధించి చాలా బాగా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ లుక్ కోస‌మే 8 – 9 కేజీల బ‌రువు త‌గ్గేందుకు ఎన్టీఆర్ జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తున్నాడు. ఈ జిమ్ వ‌ర్క‌వుట్లు ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా తార‌క్ ర‌ఫ్ లైక్‌లో ఫుల్ గ‌డ్డంతో క‌నిపిస్తాడ‌ట‌.

అంటే ఎన్టీఆర్‌ను గ‌తంలో ఎవ్వ‌రూ చూపించ‌న‌ట్టుగా కొత్త మేకోవ‌ర్‌తో కొర‌టాల చూపించ‌బోతున్నాడు. ఇక
ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నా… సంక్రాంతికే ఇప్ప‌టికే చాలా సినిమాలు లైన్లో ఉండ‌డంతో స‌మ్మ‌ర్‌కే ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news