Moviesపాన్ ఇండియా డైరెక్టర్ తో నాని.. ఆ నిందలు తప్పించుకోవడానికేనా..?

పాన్ ఇండియా డైరెక్టర్ తో నాని.. ఆ నిందలు తప్పించుకోవడానికేనా..?

ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలు అంటూ తెగ బిజీగా తమ కెరీర్ ను మలుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ అంటే ఒకప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి బాద్షా.. కాని ఇప్పుడు ఆ బాద్షాకే ఎర్త్ పెడుతోంది టాలివుడ్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ తో.. తెలుగు హీరోలు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మన అడ్డా కాకపొయ్యినా కోట్లు కొల్లగొడుతున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఠ‌క్కున గుర్తొస్తారు. ఈ హీరోల‌కు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది. వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు ఈ స్టార్ హీరోలు.

తెలుగు సినిమా స్థాయి పెర‌గ‌డంతో మ‌న హీరోలంద‌రు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌ర‌స పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అదే బాటలో వెళ్తున్నారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ తో పాన్ ఇండియా సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అలాగే అల్లు అర్జున్.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2
తో పాన్ ఇండియాను మరో సారి టచ్ చేయబోతున్నారు. ఇక ఈ లిస్ట్ లోకే నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు తెలుస్తుంది.

యస్..తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..నాని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ క్రేజీ ని చేసే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. KGF 2 సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్..ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఆ తరువాత తారక్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా, ఈ రెండు సినిమాల తరువాత..నాని తో ఓ క్రేజీ సినిమాని ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఈమధ్యే ఈ ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయని.. ప్రశాంత్ నీల్ నరేట్ చేసిన స్టోరీ విపరీతంగా నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.


అందుతున్న సమాచారం ప్రకారం దీన్ని అతి తక్కువ సమయంలోనే ముగించేలా..NTR31 ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే దీన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్ర‌శాంత్ ఊర మాస్‌గా, హీరో ఎలివేష‌న్ల‌తో సినిమాలు తీస్తాడు. కేజీఎఫ్‌తో అత‌ను ఎంత పెద్ద స్థాయికి వెళ్లిపోయాడో తెలిసిందే. వరుసగా బడా హీరోలతో సినిమాలు తీసుకుంటూ పోతే..వాళ్ళ్ అక్రేజ్ తో సినిమా హిట్ అయ్యిందనే మాట అంటారు ..అందుకే నార్మల్ హీరో తో కూడా సినిమా తీసి హిట్ కొట్టాలి అని అనుకున్నారట ప్రశాంత్. ఆ తరువాత రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ . ఈ లెక్కన చూసుకుంటే ప్రశాంత్ భవిష్యత్తులో ఎక్కువగా తెలుగు హీరోలతో బిజీ అయ్యేవిధంగా కనిపిస్తున్నాడు.

Latest news