Moviesఎఫ్ 3 ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌... మండే టెస్ట్ పెద్ద అగ్నిప‌రీక్షే...!

ఎఫ్ 3 ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌… మండే టెస్ట్ పెద్ద అగ్నిప‌రీక్షే…!

వ‌రుణ్‌తేజ్ – వెంకీ మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్ 3 సినిమాకు ముందు యునాన‌మ‌స్ హిట్ టాక్ వ‌చ్చింది. అయితే ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు మ‌రింత ఆశాజ‌న‌కంగా అయితే లేవు. సినిమా కొంత‌మందికి న‌చ్చింది. కొంత‌మందికి న‌చ్చ‌లేదు. రివ్యూస్‌, రేటింగ్స్ బాగున్నాయి. అయితే టాక్ అయితే డివైడ్‌గానే వ‌స్తోంది. అయితే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాత్రం లాజిక్కులు ప‌ట్టించుకోకుండా సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు మాత్రం మంచి ఫిగ‌ర్స్ చెపుతున్నాడు.

ఫ‌స్ట్ వీకెండ్ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 24 కోట్లకు పైగా షేర్ సాధించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే మండే టెస్ట్ ఈ సినిమా పాస్ అవుతుందా ? లేదా ? అన్న‌ది చూడాలి. ఎంత పెద్ద సినిమాకు అయినా.. ఎంత హిట్ సినిమా అయినా కూడా సోమ‌వారం వ‌చ్చిందంటే కీల‌కం.. ఇది అగ్నిప‌రీక్షే.

ఎంత పెద్ద సినిమా అయినా సోమ‌వారం ఆక్యుపెన్సీ త‌గ్గుతుంది. అయితే ఈవెనింగ్, సెకండ్ షోలు ఫిక‌ప్ అయితే మాత్రం సినిమా సేఫ్ అయిపోయిన‌ట్టే. ఎందుకంటే ఈ వారంలోనే ఎఫ్ 3 వీలున్నంత మేర పిండుకోవాలి. వ‌చ్చే వారం మేజ‌ర్‌, విక్ర‌మ్ లాంటి అంచ‌నాలు ఉన్న సినిమాలు ఎఫ్ 3కు పోటీ వ‌స్తాయి. అయితే రేట్లు నార్మ‌ల్‌గానే ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గలిగితే ఎఫ్ 3 సేఫ్ అవ్వొచ్చు.

వ‌చ్చే వారం అడ‌వి శేష్ న‌టించిన మేజ‌ర్ సినిమా భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మ‌హేష్‌బాబు నిర్మాణ భాగ‌స్వామి కావ‌డంతో పాటు భారీ ప్ర‌మోష‌న్లు, ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. సినిమాకు పాజిటిబ్ బ‌జ్ బాగా ఉంది. ఏదేమైనా ఎఫ్ 3 బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే వ‌చ్చే వారం కూడా కాస్త గ‌ట్టిగా రాబట్టుకోవాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news