Moviesయూట్యూబర్ స్టార్ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..!!

యూట్యూబర్ స్టార్ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..!!

షణ్ముఖ్‌ జశ్వంత్‌.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన టాలెంట్ తో సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్. డబ్ స్మాష్ వీడియో ల ద్వార పాపులర్ అయిన ఈయన..ఆ తరువాత క్రమక్రమంగా..టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిలంస్‌ చేసుకుంటూ..ఇప్పుడు స్టార్ హీరో కి తీసిపోని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 షోకి వెళ్లి ఉన్న పరువును పొగొట్టుకున్న షణ్ముఖ్..తన లవర్ దీప్తీ తో కూడా బ్రేకప్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ సిరి తో షణ్ముఖ్ బీహేవ్ చేసిన తీరు.. నడుచుకున్న పద్ధతి కారణంగా..బయట ఆయనకు నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువైపోయాయి. ఫ్రెండ్స్ అంటూనే..హగ్గులు, ముద్దులు అంటూ రెచ్చిపోయారు సిరి-షణ్ముఖ్ అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఇక దీంతో మనసు విరిగిపోయిన దీప్తి సునైన..అతగాడితో బ్రేకప్ చెప్పేసుకుంది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచింది. సోషల్ మీడియా లో అయితే..వీళ్ల పై ఎన్నో రకాల వార్తలు హల్ చల్ చేసాయి. దీంతో షణ్ముఖ్ కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. ఆ బాధ నుండి కోలుకుని..మళ్ళీ కెరీర్ పై కాన్ సెంట్రేషన్ చేస్తున్న సమయంలో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగ్గిలింది.

ఇంతగా పాపులర్ అయిన షన్నూకు ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి కుటుంబంలో విషాదకర సంఘటన జరిగింది.
యస్..షణ్ముఖ్‌ జశ్వంత్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. షణ్ముఖ్‌ బామ్మ మరణించినట్లు ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసి RIP అని రాసుకొచ్చాడు.

దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు..ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే షన్నూ.. బామ్మతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో..” నా పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా ‘ఏమో చూస్తానో లేదో..’ అని బామ్మ అంటుంది. దీంతో షన్నూ ‘నువ్ ఉండాలి’ అంటాడు..దీంతో వెనక ఉన్న వాల్ళు ‘నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుందిలే’ అంటుంటారు. కానీ, ఆమె లాస్ట్ కోరిక తీరకుండానే మరణించింది. దీంతో షన్ను ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news