MoviesYes, iam in Love..ప్రేమ మ్యాటర్ బయటపెట్టిన అనుపమ పరమేశ్వరన్‌..!!

Yes, iam in Love..ప్రేమ మ్యాటర్ బయటపెట్టిన అనుపమ పరమేశ్వరన్‌..!!

ఒకప్పుడు అంటే..భర్త పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడే వాళ్లు ఆడవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది..కాలంతో పాటు పద్ధతులు, సాంప్రదాయాలు మారిపోయాయి. తద్వారా మనుషులు కూడా నేటి కాలంకి తగ్గట్లు..బీహేవ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్ళి, విడాకులు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సర్వ సాధారణంగా వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా మరో హీరోయిన్ నేను లవ్ లో ఉన్నాను అంటూ అధికారికంగా ప్రకటించింది.

మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూడటానికి చక్కటి రూపం..ఆకట్టుకునే చిరునవ్వు..ఆ కళ్ళల్లో అమాయకత్వం..అందరిని బాగా ఆకట్టుకుంటాయి. నిజం చెప్పాలంటే అనుపమ కెర్రి లో పెద్దగా చెప్పుకోదగ్గిన హిట్ సినిమాలు లేకపోయినా..చేసిన ప్రతి సినిమాలు వేరియేషన్స్ చూపిస్తూ..టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా కళ్ళతోనే ఎలాంటి ఎక్స్ ప్రేషన్ ని అయిన పలికించగలదు. నితిన్ తో అ..ఆ.. నాగ చైతన్యతో చేసిన ప్రేమమ్.. శర్వానంద్ తో నటించిన శతమానం భవతి సినిమాలు మంచి కిక్కిచ్చే హిట్ సాధించాయి. మిగతా సినిమాల్లో కూడా అమ్మదు నటన బాగుంటుంది. కానీ, commercial హిట్ కాలేకపోయాయి.

అయితే , రీసెంట్ గా ఈ బ్యూటీ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది. తాజా ఇంటర్వ్యుల్లో తన లవ్ గురించిన విషయాని అధికారికంగా తెలియజేసింది. ‘ఎందుకో తెలియదు..నాకు లవ్‌ మ్యారేజ్‌ అంటే చాలా ఇష్టం. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జమటలను చూస్తుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ఈ విషయం ఆల్ రెడీ మా పేరేంట్స్‌కు కూడా చెపేశాను. వాళ్ళకి ఓకే..కానీ, అవతలి వ్యక్తి నుండి నో రెస్పాన్స్. నేను సింగిల్‌ కాదు.. అలా అని మింగిల్‌ కాదు..ఏమో నేను ఏంటో నాకే తెలియడం లేదు.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్కటి నిజం నేనైతే ప్రేమలో ఉన్నా.. అది పక్కా.. అవతలి సైడ్‌ మనసులో ఏం ఉందో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను.’ అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news