Moviesఅనిల్ రావిపూడి సినిమాలో బాల‌య్య రొమాన్స్ చేసేది ఆ హీరోయిన్‌తోనే..!

అనిల్ రావిపూడి సినిమాలో బాల‌య్య రొమాన్స్ చేసేది ఆ హీరోయిన్‌తోనే..!

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్లోనే ఫుల్ ఫామ్‌లో ఉన్న ద‌ర్శ‌కుల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. అస‌లు అప‌జ‌యం అన్న‌ది లేకుండా టాప్ లిస్టులో ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల కు సైతం ఆచార్య లాంటి ప్లాప్‌తో ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌లేదు. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఐదు వ‌రుస హిట్ల‌తో మామూలు స్వింగ్‌లో లేడు. ప‌టాస్ – రాజా ది గ్రేట్ – సుప్రీమ్ – ఎఫ్ 2 – స‌రిలేరు నీకెవ్వ‌రు ఇలా ఐదు వరుస హిట్ల‌తో అనిల్ క్రేజ్ మామూలుగా లేదు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూస్తుంటే ఎఫ్ 3 సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిపోతున్న‌ట్టే…?

ఎఫ్ 3 ప్ర‌మోష‌న్ల‌లో అనిల్ జోరు మామూలుగా లేదు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి న‌ట‌సింహం బాల‌య్య‌తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో రామారావు గారు టైటిల్‌తో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ క‌థ‌లో మార్పులు, చేర్పులు చేయాల్సి రావడంతో ఆ క‌థ ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఎట్ట‌కేల‌కు రెండేళ్లుగా బాల‌య్య కోసం ట్రై చేస్తోన్న అనిల్ స‌క్సెస్ అయ్యాడు.

 

సెప్టెంబ‌ర్ నుంచి ఈ క్రేజీ కాంబో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ద‌ర్శ‌కుడు అనిలే స్వ‌యంగా చెప్పేస్తున్నాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య‌కు కుమార్తెగా న‌టిస్తోంది. అనిల్ ఈ విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక బాల‌య్య‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌రు ? అన్న దానిపై కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ఎఫ్ 2, ఎఫ్ 3, రాజా ది గ్రేట్ లాంటి అనిల్ రావిపూడి హిట్ సినిమాల్లో న‌టించిన మెహ్రీన్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య 50 ఏళ్లు పై బ‌డిన పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. తండ్రి పాత్ర‌కు కూతురుకు మ‌ధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో చెపుతున్నాన‌ని అనిల్ చెప్పాడు.

మెహ్రీన్ అనిల్ రావిపూడికి బాగా ల‌క్కీ హీరోయిన్ అయ్యింది. ఆమెను త‌న సినిమాల్లో వ‌రుస‌గా రిపీట్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాల‌య్య సినిమాలో మ‌రోసారి ఆమెకే ఛాన్స్ ఇస్తున్న‌ట్టు టాక్ వ‌స్తోంది. బాల‌య్య‌కు జోడీగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ పేరు వినిపించినా అనిల్ రావిపూడి త‌న కంఫ‌ర్ట్ కోసం మెహ్రీన్ వైపే మొగ్గు చూపుతున్నాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news