Moviesసైట్ కొట్టిన అమ్మాయి ప‌క్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి......

సైట్ కొట్టిన అమ్మాయి ప‌క్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి… ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ…!

ప‌టాస్‌తో మొద‌లు పెట్టి తాజా ఎఫ్ 3 వ‌ర‌కు వ‌రుస‌గా ట‌పా ట‌పా సినిమాలు చేసుకుంటూ హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 సినిమా ప్ర‌మోష‌న్ల‌ను ఓ వైపు హోరెత్తించేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న నిజ జీవితానికి సంబంధించి ఓ రొమాంటిక్ సంఘ‌ట‌న‌ను అనిల్ బ‌య‌ట పెట్టాడు. తాను కాలేజ్ చ‌దువుతున్న రోజుల్లో ఓ అమ్మాయికి సైట్ కొట్టే వాడిని అని.. త‌ర్వాత అదే అమ్మాయిల బ్యాచ్‌లో ఉన్న మ‌రో అమ్మాయితో త‌న‌కు పెళ్ల‌యింద‌న్న విష‌యాన్ని బ‌య‌ట పెట్టాడు.

అనిల్ రావిపూడిది ఏపీలోని ప్ర‌కాశం జిల్లా యుద్ధ‌న‌పూడి. మ‌నోడు, అతడి భార్య ఇద్ద‌రూ క‌లిసి ఒకే కాలేజ్‌లో చ‌దువుకునే వాళ్లు. అప్పుడు అనిల్ రావిపూడితో పాటు అత‌డి ఇద్ద‌రు ఫ్రెండ్స్ ప్ర‌తి రోజు ఓ న‌లుగురు అమ్మాయిల బ్యాచ్‌ను ఫాలో అయ్యేవార‌ట‌. వాళ్ల‌లో ఓ అమ్మాయిని అనిల్ రావిపూడి రోజూ చూసేవాడ‌ట‌. అయితే ఆ అమ్మాయి స్ట్రిక్ట్ కావ‌డంతో మ‌నోడికి ప‌డ‌లేదట‌. ట్విస్ట్ ఏంటంటే అదే నలుగురు అమ్మాయిల బ్యాచ్‌లో ఉన్న మ‌రో అమ్మాయితో అనిల్‌కు పెళ్లి అయ్యింది.

అయితే సంద‌ర్భం దొరికిన ప్ర‌తి సారి కూడా ఇదే విష‌య‌మై అనిల్ రావిపూడి భార్య అత‌డిని ప్ర‌శ్నిస్తూనే ఉంటుంద‌ట‌. కాలేజ్ డేస్‌లో త‌న‌ను చూడ‌కుండా.. త‌న ప‌క్క అమ్మాయిని చూడ‌డంపై దెప్పి పొడుస్తూ ఉంటూనే ఉంటుంద‌ట‌. అయితే ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే ఎఫ్ 3 ప్ర‌మోష‌న్ల‌లో మ‌నోడు అంద‌రితో ఇంట‌రాక్ట్ అవుతోన్న టైంలో ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టాడు.

ఇక ఇప్పుడు త‌న భార్య‌తో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను అనిల్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ సినిమా తెర‌కెక్కించిన అనిల్ రెండేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని మొత్తానికి ఇప్పుడు త‌న ఎఫ్ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ బాల‌య్య‌తో అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య‌తో అనిల్ రూపొందించే సినిమాలో బాల‌య్య 50 ఏళ్ల వ‌య‌స్సు మ‌ళ్లిన తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య‌కు కుమార్తెగా న‌టిస్తోంది. అలాగే న‌య‌న‌తార పేరును హీరోయిన్‌గా ఎంపిక చేసే ప‌నిలో అనిల్‌, బాల‌య్య ఉన్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news