Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ వింటే దిమ్మ‌తిరిగాల్సిందే..!

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ వింటే దిమ్మ‌తిరిగాల్సిందే..!

స‌మంత సెకండ్ ఇన్సింగ్స్‌లో దూసుకు పోతోంది. పెళ్ల‌యినా కూడా స‌మంత సినిమాల విష‌యంలో ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టుగానే ముందుకు దూసుకుపోయింది. ఇక చైతుతో విడాకుల త‌ర్వాత స‌మంత పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ చేసిన ఐటెం సాంగ్‌లో తాను బోల్డ్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌న‌ని ఫ్రూవ్ చేసింది. అస‌లు ఆ సాంగ్‌లో సమంత‌ను చూసిన యూత్‌కు పిచ్చెక్కిపోయింది. అస‌లు స‌మంత‌కు పెళ్ల‌య్యి నిజంగా విడాకులు ఇచ్చేసిందా ? అన్నంత డౌట్ ప‌డేట్టుగా రెచ్చిపోయింది.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ఆమె ఐటెం సాంగ్ ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శాకుంత‌లం పూర్తి చేసుకుంది. అటు యశోద అనే థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టించ‌గా.. ఆ సినిమా కూడా ఆగ‌స్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌.. చివ‌ర‌కు హాలీవుడ్ అంటూ చాలా అగ్రెసివ్‌గానే సినిమాల మీద సినిమాల‌కు సైన్లు చేసేస్తోంది.

పుష్ప‌లో ఐటెం సాంగ్‌తో ఆమెకు పాన్ ఇండియా వైజ్‌గా బోల్డ్ ఇమేజ్ వ‌చ్చింది. అటు కోలీవుడ్‌లో కార్తీతో క‌లిసి న‌టిస్తోన్న సమంత టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో స‌మంత – విజ‌య్ క‌లిసి మ‌హాన‌టి సినిమాను ట్రావెల్ చేయించే పాత్ర‌ల్లో క‌నిపించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు జోడీ క‌డుతున్నారు.

ఇది రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో న‌టించేందుకు స‌మంత ఏకంగా రు. 3 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. స‌మంత‌కు పెళ్ల‌యినా క్రేజ్ త‌గ్గ‌క‌పోవ‌డంతో మేక‌ర్స్ సైతం ఆమె అడిగినంత ఇచ్చి మ‌రీ ఈ సినిమా కోసం అగ్రిమెంట్ కుద‌ర్చుకున్నార‌ని తెలుస్తోంది. స‌మంత కెరీర్‌లోనే ఇదే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ అని అంటున్నారు. గ‌తంలో ఆమె ర‌భ‌స‌, అల్లుడు శీను లాంటి సినిమాల్లో న‌టించిన‌ప్పుడు కెరీర్‌లోనే ఫుల్ ఫామ్‌లో ఉంది.

అప్పుడు మాత్ర‌మే ఆమెకు సినిమాకు రు. 3 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు అంటే 8 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ఇంత ఏజ్ పెరిగినా.. ఫేస్‌లో మునుప‌టి ఛ‌రిష్మా లేక‌పోయినా కూడా ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ అంటే మామూలు విష‌యం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news